NTR31: కేజీఎఫ్ డైరెక్టర్‌తో ఎన్టీఆర్‌ 31 ఫిక్స్

Prashanth Neel Confirms Collaboration With Jr NTR for NTR31 New Movie
x

ఎన్టీఆర్‌ 31 పై అఫిషీయల్ ఎనౌన్స్‌మెంట్ (ఫొటో ట్విట్టర్)

Highlights

కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత నీల్, జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో ఓ మూవీ వస్తున్నట్లు వార్తలు వెలువడుతున్న సంగతి తెలిసిందే.

NTR31: కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత నీల్, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో ఓ మూవీ వస్తున్నట్లు చాలా రోజులుగా వార్తలు వెలువడుతున్న సంగతి తెలిసిందే. అయితే, నేడు(మే 20) తారక్ బర్త్‌ డే సందర్భంగా ఎన్టీఆర్ 31 పై అధికారికంగా ఎనౌన్స్‌మెంట్ వచ్చేంసింది. ఈ మేరకు ట్విట్టర్లో మైత్రీ మూవీ మేకర్స్‌ ఓ ఫొటో ను విడుదల చేసింది. ఈ మేర‌కు ట్వీట్ చేస్తూ ఎన్టీఆర్‌కి పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు ద‌ర్శ‌క‌నిర్మాత‌లు.

దీంతో ఎన్నో రోజులుగా వస్తున్న వార్తలకు నేడు తెరపడినట్లయింది. ఈ కన్నడ డైరెక్టర్ ప్రస్తుతం కేజీఎఫ్ ఛాప్టర్ 2 తో బిజీగా ఉన్నాడు. అలాగే ప్రభాస్ తో సలార్ మూవీని తీయనున్నాడు. మరోవైపు ఎన్టీఆర్ కూడా ఆర్ఆర్ఆర్ మూవీతో ఫుల్ బిజీగా ఉన్నాడు. అలాగే కొరటాల శివతో NTR30 లో పనిచేయనున్నాడు. ఈ సినిమాలు పూర్తయ్యాకే ఎన్టీఆర్ 31 ప్రారంభమవుతుందని తెలుస్తోంది.

సినిమాని మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మించనున్నాయి.


Show Full Article
Print Article
Next Story
More Stories