ప్రభాస్ ఎలివేషన్ లపై దృష్టి పెట్టానున్న ప్రశాంత్ నీల్

Prashant Neil Focuses on Prabhas Elevations | Tollywood News
x

ప్రభాస్ ఎలివేషన్ లపై దృష్టి పెట్టానున్న ప్రశాంత్ నీల్

Highlights

*ప్రభాస్ ఎలివేషన్ లపై దృష్టి పెట్టానున్న ప్రశాంత్ నీల్

Prabhas Movie: "బాహుబలి" సినిమా తో ప్యాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఆ తర్వాత చేసిన రెండు సినిమాలు ప్రేక్షకులను అంతంతమాత్రంగానే మెప్పించాయి. "సాహో" సినిమా కి నెగిటివ్ రెస్పాన్స్ వచ్చినప్పటికీ కలెక్షన్ల పరంగా మంచి హిట్ అయింది. కానీ ఈ మధ్యనే ప్రభాస్ హీరోగా వచ్చిన "రాధేశ్యామ్" సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా నిలిచింది. దీంతో తన తదుపరి సినిమాల విషయంలో ప్రభాస్ జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు.

ఈ నేపథ్యంలోనే తన తదుపరి సినిమా సలార్ కి సంబంధించి కూడా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో మాట్లాడుతూ సినిమా తన అభిమానుల అంచనాలకు చేరేలా ఉండాలని చెప్పారట. అయితే తాజా సమాచారం ప్రకారం ప్రభాస్ మోకాలు దెబ్బ మరియు నడుము సర్జరీ ను దృష్టిలో ఉంచుకొని ప్రశాంత్ ప్రభాస్ కోసం తన స్టైల్ లో ఎలివేషన్ లు ఎక్కువ యాక్షన్ తక్కువ ఉండే ఫైట్ సన్నివేశాలను ప్లాన్ చేస్తున్నారట.

"కే జి ఎఫ్ 2" తోనే తన ఎలివేషన్లు తో మంచి బ్లాక్ బస్టర్ అందుకున్న ప్రశాంత్ ప్రభాస్ విషయంలో కూడా అదే చేయబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమా ఎలా ఉండబోతోందో అని అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. శృతిహాసన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ప్రభాస్ ఓం రౌత్ దర్శకత్వంలో "ఆది పురుష్", నాగ అశ్విన్ డైరెక్షన్లో "ప్రాజెక్ట్ కే" మరియు సందీప్ వంగా డైరెక్షన్లో "స్పిరిట్" సినిమాలతో కూడా బిజీగా ఉన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories