రాజమౌళి గురించి ఆస్తికరమైన కామెంట్లు చేసిన ప్రశాంత్ నీల్

* రాజమౌళి గురించి ఆస్తికరమైన కామెంట్లు చేసిన ప్రశాంత్ నీల్

admin1
Published on: 13 April 2022 10:31 AM IST
Prashant Neel Made Comments About Rajamouli | Telugu News
X

రాజమౌళి గురించి ఆస్తికరమైన కామెంట్లు చేసిన ప్రశాంత్ నీల్

Prashanth Neel: "కే జి ఎఫ్ చాప్టర్ 1" సినిమాతో కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ప్రపంచ వ్యాప్తంగా మంచి పేరు సంపాదించుకున్నారు. ప్రస్తుతం యాష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న "కే జి ఎఫ్ చాప్టర్ 2". ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మొన్నటిదాకా దేశమంతా రాజమౌళి దర్శకత్వం వహించిన "ఆర్ఆర్ఆర్" మేనియాలో మునిగి తేలింది.

ఇక ప్రస్తుతం అభిమానులు అందరూ "కే జి ఎఫ్ చాప్టర్ 2" సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా రిజల్ట్ మరియు కలెక్షన్ల విషయంలో కొందరు జోస్యం కూడా చెప్పేస్తున్నారు. కే జి ఎఫ్ చాప్టర్ 2 సినిమా తెలుగు మొదటి రోజు కలెక్షన్లతో నే రికార్డులు సృష్టించడం ఖాయమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అయితే తాజాగా సౌత్ సినిమా ఈ స్థాయిలో ఉండడానికి కారణం రాజమౌళి అని అంటున్నారు ప్రశాంత్ నీల్.

కేజిఎఫ్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ "చిన్న గల్లీ లాంటి ప్యాన్ ఇండియన్ సినిమాని 8 రోడ్ల హైవే గా మార్చేశారు రాజమౌళి. ఆయన డైరెక్టర్ కాదు.. కాంట్రాక్టర్. దక్షిణాది సినిమా కి ఇంత గుర్తింపు రావడానికి గల కారణం ఆయనే. ఆయన మాకు అతిపెద్ద స్ఫూర్తి" అంటూ రాజమౌళి పై ప్రశంసల వర్షం కురిపించారు ప్రశాంత్.

admin1

admin1

Next Story