Prakash Raj: పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన ప్రకాష్ రాజ్

పోస్టల్‌ బ్యాలెట్‌ని చివర్లో లెక్కించాలన్నాం: ప్రకాష్ రాజ్ పోస్టల్ విషయంలో మాకు అన్యాయం జరిగింది: ప్రకాష్ రాజ్

Shilpa
Updated on: 9 Oct 2021 7:01 PM IST
Prakash Raj Visiting the Polling Station
X

పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన ప్రకాష్ రాజ్(ఫైల్ ఫోటో)

Prakash Raj: 'మా' ఎలక్షన్ క్లైమాక్స్‌కు చేరుకుంది. రేపు హైదరాబాద్ జూబ్లీపబ్లిక్ స్కూల్‌ వేదికగా పోలింగ్‌కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. పోలింగ్ ఏర్పాట్లపై అధ్యక్ష పదవి రేసులో ఉన్న ప్రకాష్ రాజ్ జూబ్లీ పబ్లిక్ స్కూల్‌ను సందర్శించారు. పోలింగ్ ఏర్పాట్లను పరిశీలించేందుకే వెల్లినట్లు ప్రకాష్ రాజ్ తెలిపారు.

ఇదే సమయంలో ప్రకాష్ రాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పోస్టల్ బ్యాలెట్‌ విషయంలో తమకు అన్యాయం జరిగిందని, అందుకే వాటిని చివర్లో లెక్కించాల్సిందిగా కోరామన్నారు. గతంలో కంటే ఈసారి ఎక్కువ పోలింగ్ ఉంటుందన్న ప్రకాష్ రాజ్ ప్రతి సభ్యుడు ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.

Shilpa

Shilpa

Next Story