సీఎం జగన్‌, మంత్రి పేర్ని నానికి కృతజ్ఞతలు తెలుపుతూ ప్రకాష్ రాజ్ ట్వీట్

*'మా' ఎన్నికలకు ఏపీ ప్రభుత్వానికీ సంబంధం లేదన్న మంత్రి *పేర్ని నాని ప్రకటనపై హర్షం వ్యక్తం చేసిన ప్రకాష్ రాజ్

Arun Chilukuri
Updated on: 4 Oct 2021 6:30 PM IST
Prakash Raj Tweets on Perni Nani Comments
X

ప్రకాష్ రాజ్ (ఫైల్ ఫోటో)

Prakash Raj: మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ 'మా' ఎన్నికలకు ఏపీ ప్రభుత్వానికీ ఎలాంటి సంబంధం లేదని మంత్రి పేర్ని నాని స్పష్టతనివ్వడంపై ప్రకాష్ రాజ్ స్పందించారు. మంత్రి పేర్ని నాని ప్రకటనపై హర్షం వ్యక్తం చేసిన ప్రకాష్ రాజ్ సీఎం జగన్‌, మంత్రి పేర్ని నానికి కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేశారు.

టాలీవుడ్ మూవీ అసోషియేషన్‌ ఎన్నికల్లో పొలిటికల్ జోక్యంపై ఏపీ మంత్రి పేర్ని నాని స్పందించారు. 'మా' ఎన్నికలతో ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. అసోసియేషన్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్‌కు కానీ, వైసీపీ పార్టీకి కానీ, రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని మంత్రి స్పష్టం చేశారు. 'మా' ఎన్నికల్లో తాము ఏ వ్యక్తినీ, ఏ వర్గాన్నీ సమర్థించడంలేదని మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story