MAA Elections: మా ఎన్నికల తీరుపై ప్రకాష్ రాజ్ లేఖ

MAA Elections: ఎన్నికల ఫుటేజ్ ఇవ్వాలంటూ అధికారి కృష్ణ మోహన్ కు లేఖ

Sandeep Eggoju
Updated on: 14 Oct 2021 4:18 PM IST
Prakash Raj Letter to Election Officer Krishna Mohan
X

ఎన్నికల అధికారికి లేఖ రాసిన ప్రకాష్ రాజ్ (ఫైల్ ఇమేజ్)

MAA Elections: మా ఎన్నికల పోలింగ్ సమయంలోనూ, కౌంటింగ్ ప్రక్రియ సమయంలోనూ తమ సభ్యులను దూషించారని, భౌతిక దాడులకు దిగారని నటుడు ప్రకాష్ రాజ్ఆరోపించారు. మోహన్ బాబు, నరేష్ అనుమతి లేని వారిని సైతం లోపలికి అనుమతించి ఇష్టారాజ్యంగా ప్రవర్తించారన్నారు. ఎన్నికలకు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజ్ తమకు ఇవ్వాలని కోరారు..

ఇప్పటికే కొంత వీడియో ఫుటేజ్ బహిరంగంగా విడుదల అయిందన్నారు ఏ ఎన్నికల్లోనైనా పోలింగ్ అధికారికి కనీసం మూడు నెలలు రికార్డులు భద్రపరచడం ఆనవాయితీ అని, దీనిపై సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఉన్నాయన్నారు. సాధ్యమైనంత త్వరగా ఫుటేజ్ ఇవ్వకపోతే అది ట్యాంపరింగ్ కు గురవుతుందని, లేదా డిలీట్ అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story