Prakash Raj: 'మా' ఎన్నికలకు ప్యానల్‌ ప్రకటించిన ప్రకాష్‌రాజ్‌

Prakash Raj: *18 మంది ఎగ్జిక్యూటివ్‌ మెంబర్స్‌తో ప్రకాష్‌రాజ్‌ ప్యానల్‌ *అన్ని అంశాలు ఆలోచించాకే ప్యానల్‌ ప్రకటించాం

Arun Chilukuri
Updated on: 3 Sept 2021 6:50 PM IST
Prakash Raj Announces 18 Panel Members For MAA Elections 2021 | Tollywood News Today
X

ప్రకాష్ రాజ్ ప్యానల్ (ఫోటో ట్విట్టర్ )

Prakash Raj: 'మా' ఎన్నికలకు ప్యానల్‌ ప్రకటించారు ప్రకాష్‌రాజ్‌. ఎగ్జిక్యూటివ్‌ మెంబర్స్‌గా 18 మంది పేర్లను ఆయన ప్రకటించారు. అనసూయ, అజయ్‌, భూపాల్‌, బ్రహ్మాజీ, ఈటీవీ ప్రభాకర్‌, గోవిందరావు, ఖయ్యుం, కౌశిక్‌, ప్రగతి, రమణారెడ్డి, శ్రీధర్‌రావు, శివారెడ్డి, సమీర్, సుడిగాలి సుధీర్‌, సుబ్బరాజు, సురేష్‌ కొండేటి, తనీష్‌, టార్జన్‌ ఈ జాబితాలో ఉన్నారు. ఇక కోశాధికారిగా నాగినీడు, జాయింట్‌ సెక్రటరీలుగా అనితా చౌదరి, ఉత్తేజ్‌, వైస్‌ ప్రెసిడెంట్లుగా బెనర్జీ, హేమ పేర్లను ప్రకటించారు. ఇక ఎగ్జిక్యూటివ్ వైస్‌ ప్రెసిడెంట్‌గా శ్రీకాంత్‌, జనరల్‌ సెక్రటరీగా జీవిత రాజశేఖర్‌ను ప్రకటించగా బండ్ల గణేష్‌, సాయికుమార్‌, జీవిత, బెనర్జీ, ప్రకాష్‌రాజ్‌ స్పోక్‌ పర్సన్లుగా వ్యవహరించనున్నారు.

సినీ ఇండస్ట్రీకి సేవ చేయాలన్నదే తమ లక్ష్యమని, సినీ పరిశ్రమకు ఎంతో చేయాలని ఉందని అన్నారు ప్రకాష్‌రాజ్. అన్ని అంశాలు ఆలోచించాకే ప్యానల్‌ ప్రకటించామన్నారు ఆయన. మా ప్యానల్‌లో మహిళలకు అవకాశం కల్పించామని, సినీ పరిశ్రమలోని సమస్యలు తెలిసినవారే ప్యానల్‌లో ఉన్నారని చెప్పారు. తమకు అవకాశం ఇస్తే తామేంటో చేసి చూపిస్తామని అన్నారు ప్రకాష్‌రాజ్.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story