MAA Elections 2021: మా అధ్యక్ష ఎన్నికల్లో దూకుడు పెంచిన ప్రకాష్ రాజ్

MAA Elections 2021: సిని"మా"బిడ్డలు పేరుతో ప్యానెల్‌ ప్రకటించిన ప్రకాష్ రాజ్ * 27 మంది సభ్యులతో ప్రకాష్ రాజ్ ప్యానెల్

Sandeep Eggoju
Published on: 24 Jun 2021 4:50 PM IST
Prakash Raj Announce the 27 Panel Members in MAA President Elections 2021
X

ప్రకాష్ రాజ్ (ఫైల్ ఇమేజ్)

MAA Elections 2021: మా అధ్యక్ష ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ దూకుడు పెంచారు. సిని'మా' బిడ్డలు పేరుతో తన ప్యానెల్‌ను ప్రకటించారు. ప్రకాష్ రాజ్ ప్యానెల్‌లో మొత్తం 27 మంది పేర్లు ప్రకటించారు. జయసుధ, శ్రీకాంత్, బెనర్జీ, సాయికుమార్‌, తనీష్‌, ప్రగ‌తి, అన‌సూయ‌, స‌న, అనిత చౌద‌రి, సుధ‌, నాగినీడు, బ్రహ్మాజీ, ర‌విప్రకాష్‌, స‌మీర్‌, ఉత్తేజ్, బండ్ల గణేష్, ఏడిద శ్రీరామ్‌, శివారెడ్డి, సుడిగాలి సుధీర్ సహా పలువురి పేర్లను ప్రకటించారు.

మరోవైపు. పదవుల కోసం కాదు.. పనులు చేయడం కోసమే మా అధ్యక్ష బరిలో నిలిచినట్లు ప్రకాష్ రాజ్ స్పష్టం చేశారు. నిర్మాణాత్మక ఆలోచనలని ఆచరణలో పెట్టాలన్న ఉద్ధేశ్యంతోనే పోటీ చేస్తున్నట్లు వెల్లడించారు. టాలీవుడ్ నటీనటుల బాగోగుల కోసం.. తమ టీమ్‌తో రాబోతున్నట్లు ప్రకాష్ రాజ్ ప్రకటించారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story