మారుతిని దర్శకుడిగా మార్చిన ప్రజారాజ్యం పార్టీ

Maruthi: * చిరంజీవి వల్లే డైరెక్టర్ అయ్యాను అంటున్న మారుతి

Sriveni Erugu
Updated on: 28 Jun 2022 7:31 PM IST
Maruthi says Chiranjeevi has become a director
X

చిరంజీవి వల్లే డైరెక్టర్ అయ్యాను అంటున్న మారుతి

Maruthi: ఎంటర్టైన్మెంట్ సినిమాలు తీయడంలో డైరెక్టర్ మారుతి దిట్ట అని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటిదాకా తన ఇంటర్వ్యూల లో ఎప్పుడూ మారుతి ప్రజారాజ్యం పార్టీ గురించి చెప్పలేదు. కానీ సినిమాల్లోకి ఎంటర్ అవ్వకముందే మారుతి ప్రజారాజ్యం పార్టీ కోసం దర్శకుడిగా మారారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ విషయాన్ని స్వయంగా పంచుకున్నారు మారుతి. నిజానికి ప్రజారాజ్యం పార్టీ ఫ్లాగ్ కి మారుతీ గ్రాఫిక్ డిజైనర్ గా పనిచేశారట. ఆ పార్టీ ఫ్లాగ్ డిజైన్ కూడా తయారు చేసింది మారుతి నేనట ఆతర్వాత ప్రజారాజ్యం పార్టీ యాంతం కోసం చిరు మారుతి కే ఆ బాధ్యతను అప్పగించారు.

గోదావరి ప్రాంతాల్లో ప్రజారాజ్యం పార్టీ యాంతం కి సంబంధించిన షూటింగ్ పూర్తి చేశారు మారుతి. దానికి సంబంధించిన విజువల్స్ మరియు వీడియో చూసిన తర్వాత చిరంజీవి బాగా ఇంప్రెస్ అయ్యారట ఈ నేపథ్యంలోనే షాట్స్, విజువల్స్ స్క్రీన్ ప్లే బాగున్నాయని దర్శకుడిగా మారే ఆలోచన ఉందా అని అడిగారట. అప్పటినుంచే దర్శకత్వం అనే మాట మారుతీ మైండ్ లోకి వచ్చిందట. ప్రజారాజ్యం పార్టీ వల్లే తాను ఇప్పుడు ఒక డైరెక్టర్గా మారానని తనలోని టాలెంట్ ను ముందుగా చిరంజీవి గుర్తించారని చెప్పుకొచ్చారు మారుతి.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story