Pragya Jaiswal: ఆయన దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాను," అంటున్న ప్రగ్య

* బాలక్రిష్ణ తో నటించడం ఎలా ఉందో చెప్పిన ప్రగ్య

admin1
Published on: 27 Nov 2021 7:08 PM IST
Pragya Jaiswal says in an Interview that Whole Shooting with Balakrishna Seemed like an Amazing Journey
X

బాలక్రిష్ణ తో నటించడం ఎలా ఉందో చెప్పిన ప్రగ్య(ట్విట్టర్ ఫోటో)

Pragya Jaiswal: గత కొంత కాలంగా తెలుగులో పెద్ద బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న హీరోయిన్ల లో ప్రగ్య జైస్వాల్ కూడా ఒకరు. తాజాగా ఈమెకి సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ తో నటించే అవకాశం దొరికిన సంగతి తెలిసిందే.

బాలక్రిష్ణ హీరోగా బోయపాటి దర్శకత్వంలో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా కనిపించనుంది ప్రగ్య. తాజాగా చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటున్న ప్రగ్యా జైస్వాల్ నందమూరి బాలకృష్ణ తో కలిసి నటించడం ఎలా ఉంది అని అడగగా కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది.

"షూటింగ్ మొత్తం నాకు ఒక అద్భుతమైన జర్నీ లాగా అనిపించింది. బాలక్రిష్ణ సర్ నన్ను జస్ట్ కేవలం 5 నిమిషాల్లోనే కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యేలా చేశారు. ఆయనతో కలిసి పని చేయడం చాలా ఈజీ అనిపించింది. చాలా ఫన్ కూడా ఆయన చాలా బాగా మాట్లాడతారు.

కానీ ఏ మాత్రం భయపెట్టరు. ఆయన సెట్ లోకి రాగానే ఏదో ఒక పాజిటివ్ వెబ్ వస్తుంది. ఎంత పెద్ద స్టార్ అయినప్పటికీ ప్రతి టెక్నీషియన్ మాట వింటారు. ఆయన దగ్గర నుంచి నేను చాలా విషయాలు నేర్చుకున్నాను" అని చెప్పుకొచ్చింది ప్రగ్య.

admin1

admin1

Next Story