Pragya Jaiswal: బాలయ్య కోపం చూసి నటించాలంటే భయమేసింది.. కానీ

Sandeep Reddy
Published on: 28 July 2021 1:25 PM IST
Pragya Jaiswal Fear to Act With Balakrishna in Akhanda Movie
X

Pragya Jaiswal - Balakrishna (Photo: The Hans India)

Pragya Jaiswal: "మిర్చిలాంటి కుర్రాడు" సినిమాతో తెలుగు సినిమా ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయమైన ప్రగ్యా జైస్వాల్ ఆ సినిమాతో అంతగా ఆకట్టుకోలేకపోయిన వరుణ్ తేజ్ "కంచె" సినిమాలో హీరోయిన్ గా తన నటనతో పలు సినిమాల్లో మంచి ఆఫర్లను కొట్టేసింది. అయితే ఆ తర్వాత ఒకటి రెండు సినిమాలు మినహా మిగిలిన సినిమాలన్నీ డిజాస్టర్ గా మిగలడంతో ప్రగ్యా జైస్వాల్ కు ఆఫర్లు కూడా కరువయ్యాయి. తాజాగా ఈ భామకి బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటిస్తున్న "అఖండ" సినిమాలో హీరోయిన్ గా ఆఫర్ రావడంతో ఆ సినిమా చేయాలా వద్దా అని మొదట సంకోచంలో ఉన్నట్టు తెలిపింది.

బాలకృష్ణ కోపాన్ని ఈ మధ్య జరిగిన పలు ఆడియో కార్యక్రమాలతో పాటు పార్టీ మీటింగ్ లలో చూసిన ఈ హీరోయిన్ బాలయ్య బాబుతో సినిమా చేయడానికి భయపడినట్లు తన మనసులోని మాట చెప్పింది. ఆ భయంతో ఒకానొక సందర్భంలో సినిమాని కూడా వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపింది. అయితే పలువురు సినీ నటులు బాలయ్య గురించి చెప్పింది విని సినిమాకి ఒప్పుకున్నానని సినిమా షూటింగ్ లో పాల్గొన్న మొదటి కొన్ని రోజులు భయంగా ఉన్నా తర్వాత బాలయ్య మృదు స్వభావి అని తెలిసోచ్చిందని, తనలాంటి సీనియర్ నటుడితో నటించడం అదృష్టంగా భావిస్తున్నట్లు ప్రగ్యా జైస్వాల్ తన మనసులోని మాట అభిమానులతో పంచుకుంది.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story