Pragya Jaiswal: ఎనర్జీకే పవర్‌హౌస్..‌ బాలయ్యపై ప్రగ్యా జైస్వాల్ కామెంట్స్

Balakrishna BB3
x

బాలకృష్ణ  ప్రగ్యా జైస్వాల్

Highlights

Pragya Jaiswal: నందమూరి నటసింహాం బాలకృష్ణ- డైనమిక్ బోయపాటి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Pragya Jaiswal: నందమూరి నటసింహాం బాలకృష్ణ- డైనమిక్ దర్శకుడు బోయపాటి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి వర్కింగ్ టైటిట్ BB3 అని ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. అయితే ఈ సినిమాలో బాయల్యతో పాటు స్ర్కీన్ షేర్ చేసుకుంటుంది. 'కంచె' ఫేమ్ ప్రగ్యా జైస్వాల్. ఈ మూవీ బాలయ్యతో వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ గురించి పలు ఆసక్తికర విషయాలు తెలిపింది.

ఈ నేపథ్యంలో నందమూరి నటసింహంపై ప్రగ్యా జైస్వాల్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. రీసెంట్‌గా మీడియా ముందుకొచ్చిన హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ బాలయ్యతో స్క్రీన్ షేర్ చేసుకోవడం అనేది ఓ అద్భుతమైన అనుభవం అని చెప్పింది. ఎనర్జీకే పవర్‌హౌస్‌ బాలకృష్ణ అంటూ తెగ పొగిడేసింది. ఆయనతో సెట్‌లో ఉన్నంత సేపు ఎంతో పాజిటివ్‌గా అనిపిస్తుందని తెలుపుతూ నందమూరి ఫ్యాన్స్ ను బుట్టలో వేసుకుంది ప్రగ్యా. బాలయ్య గురించి ఆమె చేసిన ఈ కామెంట్స్ పై నందమూరి అభిమానులు ఫీదా అవుతున్నారు. కెరీర్‌లో ఎలాగైనా మలుపు తీసుకోవాలనే కోణంలో రోజులుగా సోషల్ మీడియాలో తన హాట్ హాట్ ఫోటో షూట్స్ ఇస్తుంది ఈ భామ.

మిర్యాల స‌త్య‌నారాయ‌ణ రెడ్డి స‌మ‌ర్ప‌ణ‌లో.. ద్వారక క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాణంలో BB3 ఈ మూవీ రూపొందుతోంది. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా విడుదల చేసిన 'బీబీ3 ఫస్ట్ రోర్' నందమూరి అభిమానుల అంచనాలకు రెట్టింపుచేసింది. ఈ చిత్రానికి 'మోనార్క్' , గాడ్సే అనే క్రేజీ టైటిల్స్ పరిశీలిస్తున్నట్లు సమాచారం.

Show Full Article
Print Article
Next Story
More Stories