ఓ అరుదైన రికార్డ్​ సృష్టించిన తెలుగు యాంకర్‌ ప్రదీప్!‌

ఓ అరుదైన రికార్డ్​ సృష్టించిన తెలుగు యాంకర్‌ ప్రదీప్!‌
x
Highlights

టాలీవుడ్​ టాప్​ యాంకర్‌​ లిస్ట్​లో ముందువరుసలో ఉన్న ప్రదీప్‌... ఓ అరుదైన రికార్డ్​ సృష్టించాడు. ప్రముఖ బ్రిటన్ జర్నలిస్ట్​ కిరణ్ రాయ్ రిలీజ్​ చేసిన ఆసియాలోని 400 మంది ఇన్​ఫ్లుయెన్సర్స్​ లిస్టులో ప్రదీప్‌ చోటు సంపాదించాడు.

టాలీవుడ్​ టాప్​ యాంకర్‌​ లిస్ట్​లో ముందువరుసలో ఉన్న ప్రదీప్‌... ఓ అరుదైన రికార్డ్​ సృష్టించాడు. ప్రముఖ బ్రిటన్ జర్నలిస్ట్​ కిరణ్ రాయ్ రిలీజ్​ చేసిన ఆసియాలోని 400 మంది ఇన్​ఫ్లుయెన్సర్స్​ లిస్టులో ప్రదీప్‌ చోటు సంపాదించాడు. ఈ విషయాన్ని స్వయంగా ప్రదీప్​ సోషల్​ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ఇన్​ఫ్లుయెన్సర్స్​ లిస్టులో తెలుగు ప‌రిశ్ర‌మ‌కు చెందిన ప‌లువురు ప్ర‌ముఖులు కూడా చోటు సంపాదించుకున్నారు. మ్యూజిక్​ లెజెండ్​ ఏఆర్ రెహ్మాన్, సోనూ నిగమ్, రహత్ ఫతే అలీ, జాకీర్ లాంటి ప్రముఖులున్న జాబితాలో మాకు చోటు దక్కడం ఎంతో సంతోషంగా ఉందని ప్రదీప్ అన్నాడు.

బుల్లితెరపై యాంకర్ గా కొనసాగుతూనే అవకాశాలు వచ్చినప్పుడు వెండితెరపై మెరుస్తుంటాడు ప్రదీప్‌ .. ప్రస్తుతం ప్రదీప్‌ హీరోగా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే ఓ సినిమాని చేస్తున్నాడు. ఈ సినిమాలో ప్రదీప్ సరసన అమృత అయ్యర్‌ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్, సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. మున్నా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని ఎస్.వి. ప్రొడక్షన్స్ పతాకంపై ఎస్.వి. బాబు సినిమాని నిర్మిస్తున్నారు. సినిమా పైన మంచి అంచనాలు ఉన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories