Prabhutva Junior Kalasala OTT: ఓటీటీలోకి వచ్చేసిన యూత్ ఎంటర్‌టైనర్‌.. 'ప్రభుత్వ జూనియర్ కళాశాల' ఎక్కడ చూడొచ్చంటే?

Prabhutva Junior Kalasala OTT: ప్రణవ్ ప్రీతం, షాజ్ఞ శ్రీ వేణున్ జంటగా బ్లాక్ ఆంట్ పిక్చర్స్ పతాకంపై కొవ్వూరి అరుణ సమర్పణలో వచ్చిన చిత్రం ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143'.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Updated on: 26 Sept 2024 1:57 PM IST
Prabhutva Junior Kalasala OTT: ఓటీటీలోకి వచ్చేసిన యూత్ ఎంటర్‌టైనర్‌.. ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎక్కడ చూడొచ్చంటే?
X

Prabhutva Junior Kalasala OTT: ప్రణవ్ ప్రీతం, షాజ్ఞ శ్రీ వేణున్ జంటగా బ్లాక్ ఆంట్ పిక్చర్స్ పతాకంపై కొవ్వూరి అరుణ సమర్పణలో వచ్చిన చిత్రం ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143'. ఒక యదార్థ సంఘటన ఆధారంగా శ్రీనాథ్ పులకురం ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. భువన్ రెడ్డి కొవ్వూరి ఈ సినిమాను నిర్మించారు. జూన్ 21న విడుదలైన ఈ చిత్రం యూత్, ఫ్యామిలీ ప్రేక్షకుల మనసును దోచుకుంది. ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకుల కోసం అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది.

ఈ సందర్భంగా చిత్ర దర్శక నిర్మాతలు మాట్లాడుతూ "మా ప్రభుత్వ జూనియర్ కళాశాల చిత్రాన్ని థియేటర్‌లో చుసిన వారికి ధన్యవాదాలు. చూడని వారికోసం ఒక శుభవార్త. మా సినిమా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతుంది" అంటూ చెప్పుకొచ్చాడు.

ప్రతి మనిషికి తొలి ప్రేమ ఎంతో మధురంగా, గుండెల్లో పదిలంగా ఉంటుంది. అలాంటి ఓ అందమైన తొలి ప్రేమను ప్రభుత్వ జూనియర్ కళాశాల చిత్రంలో చూపించారు. ఇంటర్మీడియట్ రోజులు.. తొలి ప్రేమ.. విరహ వేదనలు.. ఇలా అన్ని అంశాలతో కుర్రకారుని కట్టి పడేసేలా ఓ అందమైన ప్రేమ కావ్యాన్ని చూపించారు. ప్రస్తుతం ఈ ప్రేమ కథా చిత్రానికి ఓటీటీ ఆడియన్స్ ఫిదా అవుతున్నారు.

‘థియేటర్‌లో యూత్‌ని ఆకర్షించిన మా సినిమా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్‌లో ఫామిలీ ప్రేక్షకులను అలరిస్తుంది. ఓటీటీలో విడుదల అయిన తర్వాత చాలామంది ఫోన్ చేసి సినిమా చాలా బాగుంది అని చెప్తున్నారు. ఫ్యామిలీ అందరు కలిసి మంచి కుటుంబ కథ చిత్రం చూడాలి అనుకుంటే మా ప్రభుత్వ జూనియర్ కళాశాల సరైన సినిమా’ అని దర్శక నిర్మాతలు తెలిపారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story