Prabhu Deva: ప్రభుదేవా కి దొరికిన గోల్డెన్ ఛాన్స్

Prabhu Deva: ప్రభుదేవా కి దొరికిన గోల్డెన్ ఛాన్స్

Rama Rao
Updated on: 1 Oct 2022 8:30 PM IST
Prabhu Deva Planning Film With Chiranjeevi | Telugu News
X

Prabhu Deva: ప్రభుదేవా కి దొరికిన గోల్డెన్ ఛాన్స్

Prabhu Deva: "రౌడీ రాథోర్" తరువాత ప్రభుదేవా కెరీర్ లో ఒక్క హిట్ కూడా లేదు. ప్రభుదేవా మంచి హిట్ అందుకుని చాలా ఏళ్లవుతోంది. ఇక ఆ సినిమా తరువాత దాదాపు తొమ్మిది ఏళ్ల తర్వాత ప్రభుదేవా మళ్లీ ఇప్పుడు దర్శకుడిగా తన కెరీర్ రీ స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. తాజాగా ప్రభు దేవ కి ఇప్పుడు ఒక గోల్డెన్ ఛాన్స్ దొరికినట్టే కనిపిస్తోంది. వివరాల్లోకి వెళితే మెగాస్టార్ చిరంజీవి నటించిన యాక్షన్ డ్రామా "గాడ్ ఫాదర్" అక్టోబర్ 5న భారీ స్థాయిలో విడుదల అవుతున్న సంగతి తెలిసిందే.

మలయాళ హిట్ సినిమా "లూసీఫర్" రీమేక్ గా ఈ సినిమాలో తెలుగులో రీమేక్ చేశారు. మోహన్ రాజా దర్శకత్వంలో విడుదల అవుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాతో పాటు చిరు మరో రెండు ప్రాజెక్ట్ లలో కూడా నటిస్తున్నారు. "వాల్తేరు వీరయ్య", "భోళా శంకర్" వంటి రెండు సినిమాలు కూడా సైన్ చేశారు చిరంజీవి. వెంకీ కుడుములతో కూడా ఒక సినిమా చేసిన చిరు ఇప్పుడు ప్రభుదేవాతో ఓ సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. 15 ఏళ్ల క్రితం వీరిద్దరి కాంబో లో వచ్చిన "శంకర్ దాదా జిందాబాద్" అనుకున్న విజయాన్ని సాధించలేకపోయింది.

అయితే నెట్ ఫ్లిక్స్ లో పాపులర్ అయిన ఓ వెబ్ సిరీస్ బాగా నచ్చడంతో దాన్ని సినిమాగా చేయాలని అనుకుంటున్నారట. ఒక స్పానిష్ థ్రిల్లర్ ను తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా సినిమా గా మార్చమని చిరు ప్రభుదేవాకు చెప్పారట. ఫైనల్ వెర్షన్ తో ప్రభుదేవా చిరంజీవి నుండి గ్రీన్ సిగ్నల్ అందుకుంటే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందని సమాచారం. ఇది కనుక ఓకే అయితే ప్రభుదేవా కి ఇది ఒక గోల్డెన్ ఛాన్స్ అని చెప్పుకోవచ్చు. దాన్ని ప్రభు దేవ ఎంతవరకు ఉపయోగించుకుంటాతో చూడాలి.

Rama Rao

Rama Rao

Next Story