తమన్నా సినిమా అందుకే విడుదల కాలేదట

Ruthvik
Published on: 22 March 2019 6:30 PM IST
తమన్నా సినిమా అందుకే విడుదల కాలేదట
X

మొన్నటిదాకా ఒక్క సినిమా కూడా లేక వెల్వెలబోయిన థియేటర్లు ఇప్పుడు వారనికి ఒక సినిమాతో కలకళలాడబోతున్నాయి. వచ్చే నెల నుంచి వరసగా సినిమాలు విడుదలకానున్నాయి. ఏప్రిల్ 5 'మజిలీ' తో ఈ హడావిడి మొదలవనుంది. 12న సాయ తేజ్ 'చిత్రలహరి' రాబోతోంది. అయితే అదే రోజు విడుదల కావాల్సి సినిమాలలో ఒకటి ప్రభుదేవా-తమన్నా నటించిన 'దేవి 2'. హారర్ కామెడీ 'అభినేత్రి' కి సీక్వెల్ గా రాబోతోంది ఈ సినిమా. దీని మీద మంచి అంచనాలే ఉన్నాయి. కాని ఇప్పుడు ఈ సినిమా విడుదల వాయిదా పడే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.

స్వయానా దర్శకుడు విజయ్ ఈ విషయాన్ని తెలియజేసారు. దీని వెనుక ఉన్న రెండు ముఖ్య కారణాల్లో ఒకటి అదే రోజు విజయ్ దర్శకత్వం వహించిన మరో క్రైమ్ థ్రిల్లర్ 'వాచ్ మెన్' రిలీజ్ అవ్వబోతుండడం. క్లాష్ కాక తప్పదేమో అని విజయ్ అనుకున్నాడు కానీ ఇప్పుడా సమస్య లేదు. ఇక రెండో కారణం డబ్బింగ్ వెర్షన్లు. తెలుగు కన్నడకు సంబంధించి డబ్బింగ్ హక్కుల డీల్స్ ఇంకా పూర్తి కాలేదు. అన్నీ వెర్షన్స్ ఒకేసారి రిలీజ్ చేయడం మంచిది కాబట్టి డీల్ క్లోజయ్యే దాకా ఒక్క భాషలో కూడా విడుదల చెయ్యలేరు. ఈ నేపధ్యంలో సినిమా విడుదల కు ఇంకా నెల రోజులకు పైగానే పట్టేటట్టు తెలుస్తోంది.

Ruthvik

Ruthvik

Next Story