Adipurush : ఆదిపురుష్ ప్లాప్ అన్న సంగతి ముందే అతడు చెప్పాడా.. అయినా వాళ్లు వినలేదా ?

Adipurush : ఆదిపురుష్ ప్లాప్ అన్న సంగతి ముందే అతడు చెప్పాడా.. అయినా వాళ్లు వినలేదా ?
x
Highlights

Adipurush: ప్రభాస్ కెరీర్‌లోనే అతి పెద్ద డిజాస్టర్ మూవీ ఆదిపురుష్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మొదటి వారం మంచి కలెక్షన్లు రాబట్టినప్పటికీ, సినిమా క్వాలిటీ విషయంలో ప్రభాస్, చిత్రబృందం తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు.

Adipurush: ప్రభాస్ కెరీర్‌లోనే అతి పెద్ద డిజాస్టర్ మూవీ ఆదిపురుష్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మొదటి వారం మంచి కలెక్షన్లు రాబట్టినప్పటికీ, సినిమా క్వాలిటీ విషయంలో ప్రభాస్, చిత్రబృందం తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. సినిమా విమర్శకులు అయితే చాలా నెగెటివ్ రివ్యూలు ఇచ్చారు. ఇటీవల బాలీవుడ్ సీనియర్ ట్రేడ్ అనలిస్ట్, సినిమా జర్నలిస్ట్ తరణ్ ఆదర్శ్.. ఆదిపురుష్ సినిమా గురించి ప్రభాస్‌తో జరిగిన సంభాషణను ఒక పాడ్‌కాస్ట్‌లో పంచుకున్నారు.

ఆదిపురుష్ సినిమా టీజర్ విడుదలైనప్పుడు తరణ్ ఆదర్శ్ ప్రభాస్‌తో మాట్లాడారట. నాకు మీ సినిమా టీజర్ అస్సలు నచ్చలేదని తరణ్ ఆదర్శ్ ప్రభాస్‌తో చెప్పారట. దానికి ప్రభాస్, క్షమించండి, మీరు తర్వాత ఆదిపురుష్ సినిమా చూసేసరికి దానిని సరిచేస్తామని చాలా వినయంగా బదులిచ్చారట. తరణ్ ఆదర్శ్ ఈ సంఘటన గురించి చెబుతూ.. "నేను ఏ బాలీవుడ్ స్టార్‌తో అయినా ఇలా చెప్పి ఉంటే, వాళ్ళు నా ప్రొడక్ట్ అలా ఉంటుంది, ఇలా ఉంటుంది అని వాదించేవారు లేదా గొడవకు దిగేవారు. కానీ ప్రభాస్ చాలా వినయంగా తప్పును సరిచేస్తానని చెప్పాడు. ఆ దిశగా ప్రయత్నాలు కూడా చేశాడు" అని ప్రభాస్ మంచితనం గురించి ప్రశంసించారు.

అదే ఇంటర్వ్యూలో తరణ్ ఆదర్శ్ ఆదిపురుష్ సినిమా గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. "ఆదిపురుష్ కేవలం ప్లాప్ సినిమా మాత్రమే కాదు, అత్యంత చెడ్డ సినిమా. అలాంటి సినిమాలు బాలీవుడ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తాయి. అలాంటి సినిమాలు ఫ్లాప్ అవ్వాల్సిందే, ఫ్లాప్ అయ్యాయి. ఆ సినిమా ఫ్లాప్ అవ్వడం చిత్ర పరిశ్రమకు చాలా మంచిది" అని తరణ్ ఆదర్శ్ అన్నారు. ఆదిపురుష్ సినిమా భారీ బడ్జెట్‌తో ఓం రౌత్ దర్శకత్వంలో నిర్మించబడింది. ప్రభాస్‌తో సహా ఆయన అభిమానులు కూడా సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ సినిమాలో వీఎఫ్‌ఎక్స్, సీజీఐ బాలేదు. కనీసం నటీనటుల మేకప్, కాస్ట్యూమ్స్, సంభాషణలు, టెక్నికల్ వ్యాల్యూస్ బలహీనంగా ఉండటం వంటి అనేక కారణాల వల్ల సినిమా దారుణంగా ఫ్లాప్ అయింది. అంతేకాకుండా, సినిమాలోని కొన్ని సంభాషణలు వివాదాస్పదంగా మారాయి. చాలాచోట్ల కేసులు కూడా నమోదయ్యాయి. చివరికి సినిమా రచయిత క్షమాపణలు కూడా చెప్పాల్సి వచ్చింది.

ప్రస్తుతం ప్రభాస్ పలు సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆయన నటించిన రాజా సాబ్ సినిమా త్వరలో విడుదల కానుంది. ఫౌజీ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఆ తర్వాత సెప్టెంబర్ నెలలో స్పిరిట్ సినిమా ప్రారంభం కానుంది. దానితో పాటు సలార్ 2 కూడా మొదలవుతుంది. ఆ తర్వాత కల్కి 2898 ఏడీ సినిమా ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో హోంబలే ప్రొడక్షన్‌లో ప్రభాస్ నటించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories