logo

చిరంజీవితో నటించనున్న ప్రభాస్

చిరంజీవితో నటించనున్న ప్రభాస్

సాధారణంగా తెలుగు లో మల్టీ స్టారర్ చిత్రాలకి డెఫినేషన్ మారిపోయింది. ఏ ఇద్దరు హీరోలు కలిసి చేయునా దానిని మల్టీ స్టారర్ అనడం మొదలు పెట్టారు. చాలా దశాబ్దాల తర్వాత తెలుగు లో మహేష్ బాబు, వెంకటేష్ తో మల్టీ స్టారర్ ట్రెండ్ మొదలయింది. వారు కలిసి చేసిన చిత్రం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. ఆ తర్వాతా చాలా సినిమాలు వచ్చినా అందులో కొన్ని మాత్రమే నిజమైన మల్టీ స్టారర్లు. ఇప్పుడు ఆ కోవలోకే చెందే చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమా లో రామ్ చరణ్ తో పాటు ఎన్టీఆర్ నటిస్తున్నాడు. రాజమౌళి చిత్ర దర్శకుడు. ఈ చిత్రానికి మించిన మల్టీ స్టారర్ త్వరలో మొదలు కానున్నది అనే వార్త ప్రస్తుతం ఫిలిం నగర్ లో హల్చల్ చేస్తుంది.

మెగా స్టార్ చిరంజీవి మరియు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇద్దరూ కలిసి ఒక సినిమా లో నటించనున్నారు అనే రూమర్ ప్రస్తుతం అన్ని చోట్ల వినిపిస్తుంది. వీరు ఇరువురు స్టార్ హీరోలే. ఇద్దరికీ పెద్ద బడ్జెట్లు ఉన్నాయి, మంచి మార్కెట్ ఉంది. అయితే ఇద్దరూ ప్రస్తుతం రెండు రెండు సినిమాల తో బిజీ గా ఉన్నారు. 2020 నాటికి ఇద్దరూ ఫ్రీ అయ్యే అవకాశం ఉండడం తో ఇద్దరి తో ఒక మల్టీ స్టారర్ తీయాలని ప్రపోజల్ ప్రస్తుతం రెడీ అయినట్టు తెలుస్తుంది.దర్శకుడు, నిర్మాత, హీరోయిన్ వంటి వివారాలు మాత్రం ప్రస్తుతానికి గోప్యం గా ఉంచబడ్డాయి.

లైవ్ టీవి

Share it
Top