Prabhas: "సలార్" సినిమాలో ప్రభాస్ పాత్ర ఎలా ఉండబోతుందో తెలుసా?

Prabhas: నెగటివ్ పాత్రలో కనిపించనున్న ప్రభాస్

Dhatripriya
Updated on: 23 April 2023 8:00 PM IST
Prabhas Will Be Seen In Negative Role
X

Prabhas: "సలార్" సినిమాలో ప్రభాస్ పాత్ర ఎలా ఉండబోతుందో తెలుసా?

Prabhas: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేతిలో ఇప్పుడు బోలెడు భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. అందులో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాలలో ఒకటి "సలార్". ఇక సినిమా మొదలైనప్పటి నుంచి కేజిఎఫ్ సినిమాకి మరియు ఈ సినిమాకి మధ్య ఏదైనా లింక్ ఉంటుందేమోనని కామెంట్లు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా ఇప్పుడు ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటకు వస్తున్నాయి.

కే జి ఎఫ్ సినిమాలో రాకీ బాయ్ పాత్ర రూల్స్ కి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటుంది. ఇప్పుడు "సలార్" సినిమాలో ప్రభాస్ పాత్ర కూడా అలానే ఉండబోతుందని తెలుస్తోంది. అంటే ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర కూడా పూర్తి నెగిటివ్ పాత్రగా ఉండబోతుందట. కానీ ప్రభాస్ వంటి స్టార్ హీరోని ఒక నెగిటివ్ పాత్రలో చూపించటం అంతా సులువైన విషయం కాదు. ఏమాత్రం తేడా వచ్చినా సినిమా ఫ్లాప్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఈ నేపథ్యంలో ఇది ఒక రిస్క్ అనే చెప్పాలి. మరి ప్రశాంత్ నీల్ ఈ రిస్క్ తీస్కుని ఎంత వరకు సక్సెస్ అవుతారో చూడాలి.

ప్రముఖ మలయాళం నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో పృథ్వీరాజ్ వరదరాజు మన్నార్ అనే పాత్ర లో కనిపిస్తున్నారు. శృతి హాసన్ ఈ సినిమాలో ప్రభాస్ సరసన హీరోయిన్ గా నటించింది. జగపతి బాబు ఈ సినిమాలో మరొక ముఖ్య పాత్రలో కనిపించనున్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story