Trivikram- Prabhas: త్రివిక్రమ్ దర్శకత్వంలో ప్రభాస్..!?

Sandeep Reddy
Published on: 18 July 2021 4:12 PM IST
Prabhas Trivikram Combination Movie Will Out In Soon By Radha Krishna Production
X

ప్రభాస్ - త్రివిక్రమ్ 

Trivikram- Prabhas: సన్నాఫ్ సత్యమూర్తి, జులాయి, అరవింద సమేతా వంటి సూపర్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన త్రివిక్రమ్ చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించిన రాధాకృష్ణ అతి త్వరలో మరో భారీ బడ్జెట్ చిత్రానికి శ్రీకారం చుట్టనున్నట్లు సినీ వర్గాలలో వార్తలు వినిపిస్తున్నాయి. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా సినిమా నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం రాధే శ్యామ్, సలార్, అదిపురుష్ వంటి సినిమాల షూటింగ్ తో బిజీగా ఉన్న ప్రభాస్ ని ఆ సినిమాల తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమాకి ఒప్పించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. తన కెరీర్లో ఇప్పటి వరకు త్రివిక్రమ్ దర్శకత్వంలో ప్రభాస్ ఒక్క సినిమాలో కూడా నటించకపోవడం, స్టార్ హీరోలను డైరెక్ట్ చేసిన త్రివిక్రమ్ తో ప్రభాస్ సినిమా రాబోతుందనే అనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.

తక్కువ సమయంలోనే "బాహుబలి" వంటి సూపర్ హిట్ చిత్రంతో పాన్ ఇండియా హీరోగా ఎదిగిన ప్రభాస్ పాన్ ఇండియా లెవెల్ లో సినిమాలు చేస్తుండటంతో త్రివిక్రమ్ ఎటువంటి కథని సిద్ధం చేస్తున్నాడు.. ప్రస్తుతం ప్రభాస్ ప్రస్తుతం ఉన్న బిజీ షెడ్యుల్ కి ఎంత కాలం తర్వాత ఆ సినిమా అన్ని పనులు పూర్తి చేసుకొని పట్టాలెక్కనుందో తెలియాలంటే మరికొంత సమయం వేచి చూడాల్సిందే. హారిక అండ్ హాసిని బ్యానర్ లో నిర్మాత రాధాకృష్ణ ఎంత వరకు ఈ స్టార్ హీరో మరియు దర్శకుడిని ఒప్పించి ఎలాంటి కథతో సినిమాని నిర్మించబోతున్నడో అని సినీ అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story