Prabhas: మరోసారి ప్రశాంత్ నీల్‌తో జతకట్టనున్న ప్రభాస్?

Prabhas: ప్రభాస్ మరో కొత్త సినిమాలో సంతకం చేస్తున్నాడు. ప్రశాంత్ నీల్‌తో మరోసారి జతకట్టనున్నట్లు తెలుస్తోంది.

Venkata Chari
Published on: 10 May 2021 6:22 PM IST
Prabhas To Team Up With Prashant Neel Again? | Prabhas New Movie Updates
X

ప్రభాస్ (ఫొటో ట్విట్టర్)

Prabhas: యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ మరో కొత్త సినిమాలో సంతకం చేస్తున్నాడు. ప్రశాంత్ నీల్‌తో మరోసారి జతకట్టనున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ ప్రస్తుతం తన రాబోయే చిత్రం 'రాధే శ్యామ్' విడుదల కోసం ఎదురుచూస్తున్నాడు.

అలాగే మరో సినిమా 'ఆదిపురుష్' తో బిజీగా ఉన్నాడు. 'తన్హాజీ' ఫేమ్ ఓం రౌత్ చిత్రం ఈ ప్రాజెక్టును నిర్మిస్తోంది. 'కేజీఎఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్, 'మహానటి' ఫేమ్ నాగ్ అశ్విన్ వంటి దర్శకులతో ప్రభాస్ కొన్ని ప్రాజెక్టులు లైన్‌లో పెట్టిన సంగతి తెలిసిందే. తాజా సంచలనం ప్రకారం, 'సలార్' తర్వాత ప్రశాంత్ నీల్‌తో కలిసి మరోసారి పనిచేయడానికి ప్రభాస్ అంగీకరించినట్లు సమాచారం. నిర్మాత దిల్ రాజు ఈ ప్రాజెక్టును నిర్మించేందుకు రెడీ గా ఉన్నాడని సమాచారం. అన్నీ సక్రమంగా జరిగితే ప్రభాస్, ప్రశాంత్ నీల్ తమ రెండో సినిమాను 2024 లో ప్రారంభించనున్నారు.

ప్రభాస్, ప్రశాంత్ నీల్ ఇద్దరూ ఈ ప్రాజెక్ట్ కోసం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ పూర్తి చేసిన తరువాత, ఆ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. అయితే అంతకుముందే బాలీవుడ్ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ తో ప్రభాస్ ఓ సినిమా చేయనున్నాడు.

Venkata Chari

Venkata Chari

Next Story