Salaar: ప్రభాస్ కి కండిషన్ పెట్టిన ప్రశాంత్ నీల్

Salaar: టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చాలా త్వరగా వెయిట్ పెరుగుతుంటారు.

Arun Chilukuri
Updated on: 18 May 2022 5:30 PM IST
Prabhas to Lose Weight for Salaar Movie
X

Salaar: ప్రభాస్ కి కండిషన్ పెట్టిన ప్రశాంత్ నీల్

Salaar: టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చాలా త్వరగా వెయిట్ పెరుగుతుంటారు. ఎంతైనా ప్రభాస్ భోజనప్రియుడు కాబట్టి ఎప్పటికప్పుడు జిమ్ చేస్తూ ఫిట్గా ఉండాల్సి వస్తోంది. కొంచెం రిలాక్స్ అయినా ప్రభాస్ కి చాలా త్వరగా ఒళ్ళు వస్తుంది. అయితే తాజాగా ప్రభాస్ కొంచెం వెయిట్ పెరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నిర్మాతలు ప్రభాస్ గ్రాఫిక్స్ వాడి సన్నగా చూపించాల్సి వస్తోంది. అయితే తాజా సమాచారం ప్రకారం ప్రభాస్ తన తదుపరి సినిమా కోసం బరువు తగ్గాలని నిర్ణయించుకొని దానికి తగ్గట్టుగానే ఎక్సర్సైజ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ప్రభాస్ హీరోగా నటిస్తూ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా "సలార్". కేజీఎఫ్ ఫేం డైరెక్టర్ ప్రశాంత్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ 50 శాతం పూర్తయింది. సినిమా రెండు భాగాల్లో విడుదల కాబోతోంది కాబట్టి ఈ సినిమా పూర్తయిన వెంటనే ప్రభాస్ "సలార్" పార్ట్ 2 తో బిజీ కాబోతున్నారు. అయితే "సలార్ 2" షూటింగ్ మొదలు పెట్టాలంటే ముందు ప్రభాస్ బరువు తగ్గాలని ప్రశాంత్ నీల్ కండిషన్ పెట్టాడట. ఈ నేపథ్యంలోనే ప్రభాస్ మారుతి సినిమాని కూడా హోల్డ్ లో పెట్టి "సలార్" సినిమా పై ఫోకస్ చేస్తున్నారు. మరో వైపు ఈ సమయంలో మారుతి పూర్తి బౌండ్ స్క్రిప్ట్ ని కంప్లీట్ చేసే పనిలో పడ్డారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story