Prabhas: "రాధేశ్యామ్" దెబ్బకి అతనిని మార్చేసిన ప్రభాస్..?

Prabhas: "బాహుబలి" సినిమాతో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మర్చిపోలేని బ్లాక్ బస్టర్ ని అందుకున్నారు కానీ ఆ తరువాత మాత్రం ఒక్క మంచి హిట్టు కూడా ప్రభాస్ కరియర్ లో పడలేదు.

Arun Chilukuri
Published on: 21 Sept 2022 12:40 PM IST
Prabhas to Dub in Adipurushs Hindi version?
X

Prabhas: "రాధేశ్యామ్" దెబ్బకి అతనిని మార్చేసిన ప్రభాస్..?

Prabhas: "బాహుబలి" సినిమాతో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మర్చిపోలేని బ్లాక్ బస్టర్ ని అందుకున్నారు కానీ ఆ తరువాత మాత్రం ఒక్క మంచి హిట్టు కూడా ప్రభాస్ కరియర్ లో పడలేదు. ఒక వైపు సాహో సినిమా అంతంత మాత్రంగానే ఆడగా మరోవైపు "రాధేశ్యామ్" సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మారింది. భారీ అంచనాల మధ్య విడుదలైనప్పటికీ అభిమానులు సైతం ఆ సినిమాని మర్చిపోవాల్సిన అవసరం ఏర్పడింది. అయితే తాజాగా తన తదుపరి సినిమాల విషయంలో ప్రభాస్ అతి జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

త్వరలోనే ప్రభాస్ హీరోగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో "ఆది పురుష్" అనే సినిమా తెరకెక్కనుంది. భారీ బడ్జెట్ ప్యాన్ ఇండియన్ సినిమాగా విడుదల కాబోతున్న ఈ చిత్రం తెలుగులో మాత్రమే కాక మిగతా భాషల్లో కూడా విడుదల కాబోతోంది. బాహుబలి హిందీ వర్షన్ లో ప్రభాస్ పాత్రకి శరద్ కేల్కర్ డబ్బింగ్ చెప్పారు. అతని వాయిస్ ప్రభాస్ కి బీభత్సంగా సెట్ అయిపోవడంతో సినిమాకి మరింత క్రేజీ ఏర్పడింది.

అదే జోరుతో శరద్ కేల్కర్ ప్రభాస్ నటించిన "రాధే శ్యామ్" సినిమాకి కూడా డబ్బింగ్ చెప్పారు. కానీ ఆ సినిమా డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈసారి రిస్క్ తీసుకోకుండా ప్రభాస్ స్వయంగా తన పాత్రకి డబ్బింగ్ చెప్పుకోవాలని ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే శరద్ కేల్కర్ "ఆది పురుష్" డబ్బింగ్ పూర్తి చేసినప్పటికీ ప్రభాస్ మాత్రం తానే స్వయంగా డబ్బింగ్ చెబితే బాగుంటుందని అనుకుంటున్నట్లు సమాచారం.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story