ప్రభాస్20 షూటింగ్ మళ్ళీ మొదలు

ప్రభాస్20 షూటింగ్ మళ్ళీ మొదలు
x
Highlights

టాలీవుడ్ 'బాహుబలి' ప్రభాస్ ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అందులో ఒకటి సుజిత్ దర్శకత్వంలో చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్ 'సాహో'...

టాలీవుడ్ 'బాహుబలి' ప్రభాస్ ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అందులో ఒకటి సుజిత్ దర్శకత్వంలో చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్ 'సాహో' కాగా రెండవది రాధాకృష్ణ దర్శకత్వంలో చేస్తున్న సినిమా. రొమాంటిక్ ప్రేమ కథ గా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రానికి 'జాన్' అనే టైటిల్ ను అనుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. పూజా హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే 'సాహో' సినిమా లో ఒక మేజర్ షెడ్యూల్ పూర్తిచేసిన ప్రభాస్ ఇప్పుడు ఈ చిత్రంపై దృష్టి పెట్టనున్నారు.

ఇప్పటికే చిత్ర బృందం అన్నపూర్ణ స్టూడియోస్ లో ఒక సెట్ ను సిద్ధం చేసిందట. రేపటి నుంచి అక్కడ ప్రభాస్20 షూటింగ్ లోని కొత్త షెడ్యూల్ మొదలవుతుంది. ప్రముఖ ప్రొడక్షన్ డిజైనర్ రవీందర్ ఈ షెడ్యూల్ కోసం ఇటలీ బ్యాక్ డ్రాప్ వచ్చేలాగా సెట్ ను డిజైన్ చేశారట. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది కానీ అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడాల్సి ఉంది. గోపీకృష్ణ మూవీస్ మరియు యూ వి క్రియేషన్స్ బ్యానర్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి అమిత్ త్రివేది సంగీతాన్ని అందిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories