Prabhas: రూ. వెయ్యి కోట్ల బడ్జెట్‌తో ప్రభాస్‌ కొత్త సినిమా.. డైరెక్టర్‌ ఎవరంటే..

Pavan Reddy
Published on: 3 Nov 2024 12:41 PM IST
Prabhas: రూ. వెయ్యి కోట్ల బడ్జెట్‌తో ప్రభాస్‌ కొత్త సినిమా.. డైరెక్టర్‌ ఎవరంటే..
X

Prabhas, Lokesh Kanagaraj Movie: ప్రభాస్.. ఇప్పుడీ పేరు ఓ సంచలనం. ఈ రెబల్‌ స్టార్‌ నుంచి కొత్త సినిమా వస్తుందంటే చాలు ఎక్కడలేని అంచనాలు ఉంటున్నాయి. గ్లోబల్‌ స్టార్‌గా ఎదిగిన ప్రభాస్‌ సినిమా కోసం యావత్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీ వేయి కళ్లతో ఎదురు చూస్తోంది. బాహుబలితో మొదలైన ప్రభాస్‌ ప్యాన్ ఇండియా క్రేజ్ .. సలార్‌, కల్ సినిమాలతో పీక్స్‌కి చేరింది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్‌ మరో క్రేజీ ప్రాజెక్ట్‌లో నటించనున్నారని తెలుస్తోంది.

లోకేష్ కనగరాజ్‌తో ప్రభాస్‌ చేతులు కలపబోతున్నారనేది సదరు వార్త సారాంశం. స్టార్ హీరోలతో మాఫియా బ్యాక్‌డ్రాప్ కథలను తెరకెక్కిస్తున్న లోకేష్‌ సినిమాటిక్ యూనివర్స్‌లో ఇప్పటి వరకు ‘ఖైదీ’, ‘విక్రమ్’, ‘లియో’ సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ మూడు సినిమాలు భారీ విజయాన్నినమోదు చేసుకున్నాయి. కాగా ఇప్పుడీ యూనివర్స్‌లోకి ప్రభాస్‌ కూడా రానున్నట్లు తెలుస్తోంది.

లోకేష్‌ ఇటీవల ప్రభాస్‌కు కథ చెప్పడంతో అందుకు ఆయన గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. అయితే లోకేష్ కనగరాజ్ గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రభాస్‌తో భారీ బడ్జెట్ సినిమా చేస్తానని చెప్పడం కూడా ఈ వార్తలకు బలం చేకూర్చినట్లైంది.

ఇదిలా ఉంటే ఈ సినిమాను లోకేష్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించబోతున్నారని టాక్‌. ఏకంగా రూ. 1000 కోట్ల బడ్జెట్‌తో లోకేష్ కనగరాజ్ ఈ సినిమా ప్లాన్ చేస్తున్నాడు అంటూ కథనాలు వస్తున్నాయి. త్వరలోనే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ప్రభాస్‌ ప్రస్తుతం ఐదు సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇవన్నీ పూర్తయ్యే సరికి కనీసం 4 ఏళ్లు పట్టడం ఖాయం. దీంతో ప్రభాస్ - లోకేష్ కాంబోలో మూవీ పట్టాలెక్కాలంటే చాలా కాలం ఎదురు చూడాల్సిందే.

Pavan Reddy

Pavan Reddy

Next Story