"ఆర్ఆర్ఆర్" పై రియాక్ట్ అయిన ప్రభాస్

Prabhas: ప్రస్తుతం టాలీవుడ్ మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా "ఆర్ఆర్ఆర్".

Arun Chilukuri
Published on: 5 March 2022 4:36 PM IST
Prabhas Super Words About RRR Movie
X

"ఆర్ఆర్ఆర్" పై రియాక్ట్ అయిన ప్రభాస్

Prabhas: ప్రస్తుతం టాలీవుడ్ మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా "ఆర్ఆర్ఆర్". బాహుబలి సినిమా తరువాత ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కనున్న సినిమా ఇది. ప్రీ ఇండిపెండెన్స్ బ్యాక్ డ్రాప్ తో సాగనున్న ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించనుండగా ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో కనిపించనున్నారు. ఎప్పుడో జనవరిలో విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది. తాజాగా ఈనెల 25వ తేదీన థియేటర్లలో భారీ రేంజ్ లో విడుదలకు సిద్ధమవుతోంది.

ఈ నేపధ్యంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మార్చి 11న విడుదల కాబోతున్న తన "రాధే శ్యామ్" సినిమా ప్రమోషన్స్తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ "ఆర్ఆర్ఆర్" సినిమా గురించి చెప్పుకొచ్చారు ప్రభాస్. "నేను పూర్తి సినిమా చూడలేదు కానీ నాకు కథ మొత్తం తెలుసు. ఆర్ఆర్ఆర్ కూడా ఖచ్చితంగా అతి పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది. అందరూ చాలా బాగా నటించారు" అని చెప్పుకొచ్చారు ప్రభాస్. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న "రాధే శ్యామ్" సినిమాకి రాధా కృష్ణ దర్శకత్వం వహించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story