Radhe Shyam: "రాధేశ్యామ్" డబ్బింగ్ మొదలుపెట్టిన ప్రభాస్

Prabhas Start the Dubbing to Radhe Shyam Movie
x
రాధే శ్యామ్ డబ్బింగ్ పనుల్లో బిజీగా ఉన్న ప్రభాస్ (ఫైల్ ఇమేజ్)
Highlights

Radhe Shyam: "రాధేశ్యామ్" డబ్బింగ్ పనుల్లో బిజీగా ఉన్న ప్రభాస్

Radhe Shyam: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా స్టార్ హీరోయిన్ పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న సినిమా "రాధేశ్యామ్". రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఇంతకుముందు ఎప్పుడూ చూడనటు వంటి ఒక అద్భుతమైన ఫ్యాంటసీ ప్రేమ కథ గా తెరకెక్కనుంది. భారీ అంచనాలు మధ్య ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా 14 జనవరి న విడుదల కాబోతోంది. తాజాగా ఈ సినిమా టైం లైన్ కాన్సెప్టుతో నడవనుంది అని, 1911లో ఇటలీలో 106 మంది ప్యాసింజర్ లతో ఉన్నట్టుండి మాయమైపోయిన జనెట్టీ ఒక అనే ట్రైన్ కథ ఆధారంగా ఉండనుంది అని సమాచారం.

తాజా సమాచారం ప్రకారం ప్రభాస్ ఈ రోజు నుండి ఈ సినిమా డబ్బింగ్ పనులను మొదలుపెట్టారట. చాలా కాలం తర్వాత ప్రభాస్ నటిస్తున్న ప్రేమకథ కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలొన్నాయి. టి సిరీస్ మరియు యు.వి క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా లో కృష్ణంరాజు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. జస్టిన్ ప్రభాకరన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories