The Rajasaab OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘ది రాజాసాబ్’.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?

The Rajasaab OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘ది రాజాసాబ్’.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?
x
Highlights

The Rajasaab OTT: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో రూపొందిన ఫాంటసీ హారర్ కామెడీ చిత్రం ‘ది రాజాసాబ్’ (The Raja Saab).

The Rajasaab OTT: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో రూపొందిన ఫాంటసీ హారర్ కామెడీ చిత్రం ‘ది రాజాసాబ్’ (The Raja Saab). ఈ సంక్రాంతికి థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించిన ఈ సినిమా, ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో సందడి చేసేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ జియో హాట్‌స్టార్ (Jio Hotstar) వేదికగా ఈ సినిమా ఫిబ్రవరి 6 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఈ మేరకు సంస్థ అధికారికంగా స్పష్టతనిచ్చింది.

కథా నేపథ్యం: దేవనగర సంస్థాన మాజీ జమిందారు గంగాదేవి (జరీనా వహాబ్), తన మనవడు రాజు అలియాస్ రాజాసాబ్‌ (ప్రభాస్)తో కలిసి సాధారణ జీవితం గడుపుతుంటుంది. మతిమరుపు ఉన్నప్పటికీ, తన భర్త కనకరాజు (సంజయ్‌దత్)ని మాత్రం ఆమె అస్సలు మరిచిపోదు. తన కలలో కనిపిస్తున్న భర్తను వెతికి తీసుకురమ్మని మనవడిని కోరుతుంది.

అయితే, మార్మిక విద్యలు తెలిసిన కనకరాజు.. తన నాన్నమ్మ, మనవడిని నర్సాపూర్ అడవిలోని రహస్య రాజమహల్‌కి వచ్చేలా ప్లాన్ చేస్తాడు. అసలు కనకరాజు ఎందుకు వారిని పిలిచాడు? తనను కాదనుకున్న వారిని చంపాలనుకున్నాడా? ముగ్గురు అందగత్తెలు భైరవి (మాళవిక మోహనన్‌), బ్లెస్సీ (నిధి అగర్వాల్), అనిత (రిద్ది కుమార్)లు రాజాసాబ్ జీవితంలోకి ఎలా వచ్చారు? అన్నదే ఈ చిత్ర ప్రధానాంశం.

ప్రభాస్ మార్క్ మాస్ యాక్షన్, మారుతి మార్క్ కామెడీ మిక్స్ అయిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. ఇప్పుడు ఫిబ్రవరి 6 నుంచి ఇంట్లోనే కూర్చుని ఈ వినోదాన్ని ఆస్వాదించే అవకాశం లభించడంతో ప్రభాస్ అభిమానులు ఖుషీ అవుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories