Prabhas: ప్రభాస్ చెల్లికి చేదు అనుభవం..

Prabhas: ప్రభాస్ సోదరి కృష్ణంరాజు కుమార్తె ప్రసీద రాధేశ్యామ్ సినిమాతో నిర్మాతగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టారు.

Arun Chilukuri
Updated on: 4 Jun 2022 5:00 PM IST
Prabhas Sister Praseeda Worst Experience With Swiggy
X

Prabhas: ప్రభాస్ చెల్లికి చేదు అనుభవం..

Prabhas: ప్రభాస్ సోదరి కృష్ణంరాజు కుమార్తె ప్రసీద రాధేశ్యామ్ సినిమాతో నిర్మాతగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టారు. అయితే తాజాగా ప్రసీదకు చేదు అనుభవం ఎదురైంది. ప్రసీద సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టు పెట్టింది. ప్రసీద సోషల్ మీడియా వేదికగా స్విగ్గీ సేవలను విమర్శిస్తూ పోస్ట్ పెట్టారు. స్విగ్గీ వాళ్ల నుంచి తనకు చేదు అనుభవం ఎదురైందని ఆమె తెలిపారు. స్విగ్గీ నుంచి క్వాలిటీ లేని ఆహారం డెలివరీ కాగా ఫిర్యాదు చేస్తే వాళ్లు చేతులెత్తేశారని ఆమె వెల్లడించారు. ఆలస్యంగా డెలివరీ చేస్తున్నారని క్వాలిటీ ఫుడ్ అందించలేదని ప్రసీద కామెంట్లు చేశారు.

ఇది అత్యంత చెత్త సర్వీస్. దేశంలో అతి పెద్ద ఫుడ్ డెలివరీ యాప్ అయిన స్విగ్గీ తన కస్టమర్లకు సరైన ఫుడ్ అందుతుందా? లేదా? అని తెలసుకోవాల్సిన కనీస బాధ్యత. కానీ ఆ బాధ్యత నిర్వర్తించడం లేదు. అదీ కాకుండా కస్టమర్ల మీద నిందలు వేస్తోంది. మామూలుగా అయితే ఇలాంటివి నేను చెప్పను. కానీ ఇలా రోజూ అవుతుండటం, వారు చేసిన తప్పులకు మనల్ని నిందించడంతో నా ఫ్రస్ట్రేషన్ పెరిగింది. స్విగ్గీ కంటే మంచి సేవలు అందించే యాప్స్ ఉండటం సంతోషం.. ఇకపై నేను ఎప్పుడూ స్విగ్గీని వాడను' అంటూ ప్రసీద ట్వీట్లు చేశారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story