Prabhas: మూడు సన్నివేశాల తోనే సినిమా సైన్ చేసిన ప్రభాస్

Prabhas Signed the Film With Three Scenes
x

మూడు సన్నివేశాల తోనే సినిమా సైన్ చేసిన ప్రభాస్

Highlights

Adipurush: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా "ఆది పురుష్".

Adipurush: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా "ఆది పురుష్". బాలీవుడ్లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ప్రభాస్ ఈ సినిమాతో మరొక భారీ విజయాన్ని సాధించబోతున్నారు అని అభిమానులు ముందుగానే ఫిక్స్ అయిపోయారు. అయితే ముందుగా ఒక స్క్రిప్ట్ అనుకున్న తర్వాత 2020 మార్చ్ లో భారతదేశంలో మొట్టమొదటి సారిగా కావిడ్ లాక్ డౌన్ అమలు చేసినప్పుడు రామాయణాన్ని మళ్లీ రిఫరెన్స్ గా తీసుకొని స్క్రిప్ట్ ఓం రౌత్ మళ్ళీ రీరైట్ చేశారట. దీనికి 45 రోజులు పట్టినట్లు తెలుస్తోంది. అప్పటికి ప్రభాస్ కి అంత క్రేజ్ లేకపోయినప్పటికీ ప్రభాస్ అయితేనే సినిమా బాగుంటుందని om రౌత్ ముందుగానే అనుకున్నారట.

ఈ నేపథ్యంలో ప్రభాస్ ని పిలిచి కథ వినిపించారు రౌత్. అయితే కేవలం రెండు మూడు సన్నివేశాలు విన్న వెంటనే ప్రభాస్ సినిమాకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. కేవలం మూడే మూడు సన్నివేశాలు విన్న వెంటనే ప్రభాస్ కి కథ విపరీతంగా నచ్చేసి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. ఇక ఒక ప్రైవేట్ జట్ లో ముంబై నుంచి హైదరాబాద్ కి తిరిగి వస్తున్న కొద్ది గంటల్లోనే మిగతా కథను ఓం రౌత్ ప్రభాస్ కి వినిపించాడట. రామాయణం ఆధారంగా తెరకెక్కనున్న ఈ సినిమాలో ప్రభాస్ శ్రీరాముడి పాత్రలో కనిపించనుండగా, సీత పాత్రలో కృతి సనన్ కనిపించనుంది. బాలీవుడ్ నటులు సన్నీ సింగ్, సైఫ్ అలీ ఖాన్ తదితరులు ఈ సినిమాల్లో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories