Adipurush: పాన్ ఇండియా హీరోల్లో ట్రెండ్ సెట్ చేసిన ప్రభాస్.. ఆదిపురుష్ జోరుతో సలార్ తీరు మారబోతోందా?

Prabhas Set the Trend Among Pan India Heroes
x

Adipurush: పాన్ ఇండియా హీరోల్లో ట్రెండ్ సెట్ చేసిన ప్రభాస్.. ఆదిపురుష్ జోరుతో సలార్ తీరు మారబోతోందా?

Highlights

Prabhas: ఆదిపురుష్ మూవీ వచ్చి రాగానే వసూళ్ల వరదొచ్చింది. పాన్ ఇండియా లెవల్లో ప్రభాస్ తర్వాత ఆ రేంజ్ ఉన్న మరో హీరోలేడనేంతగా రికార్డులు మోత మోగింది.

Prabhas: ఆదిపురుష్ మూవీ వచ్చి రాగానే వసూళ్ల వరదొచ్చింది. పాన్ ఇండియా లెవల్లో ప్రభాస్ తర్వాత ఆ రేంజ్ ఉన్న మరో హీరోలేడనేంతగా రికార్డులు మోత మోగింది. హిట్లు, ఫ్లాపులకు అతీతమైన హీరో అనేంతగా ప్రభాస్ కి మార్కెట్ క్రియేట్ అయ్యింది. ప్రభాస్ ని మొదట్లో కేవలం రాజమౌలి పుణ్యమాని పాన్ ఇండియా లెవల్లో దుమ్ముదులిపిన హీరో అన్నారు. అది నిజమే కావొచ్చు. కాని బాహుబలి 1,2 తో తనకి ఇమేజ్, హిట్స్, రికార్డులతో పాటు గుర్తింపు దక్కిందా. ఆ గుర్తింపే తనకి స్టేబుల్ మార్కెట్ లా మారటంలో తన ప్రయత్నం ఫలించినట్టే కనిపిస్తోంది.

బాహుబలి 2 తర్వాత సాహోతో ప్రభాస్ దండెత్తినప్పుడు, ఇది మరో సెన్సేషనల్ హిట్ అవుతుందనుకున్నారు. కాని సౌత్ లో సాహో ప్లాపైంది. అయినా కాని ఓవరాల్ గా 350 కోట్లమూవీకి 450 కోట్ల వసూళ్లు రావటంతో అంతా ఆశ్చర్యపోయారు. అలా ప్రభాస్ మార్కెట్ స్టామినా అందరికీ అర్ధమైంది. సాహో తర్వాత వచ్చిన రాధేశ్యామ్ అయితే, సౌత్ లోనే కాదు నార్త్ లో కూడా ఫ్లాప్ టాక్ ని సొంతం చేసుకుంది. విచిత్రంగా ఈ ఫెల్యూర్ మూవీ కూడా 200 కోట్ల తో తీస్తే 270 కోట్లొచ్చాయి. సో వరుస రెండు ఫెల్యూర్స్ కూడా వందలకోట్లు రాబట్టడంతో, పాన్ ఇండియాలెవల్లో ఇంతగా మార్కెట్ ఉన్నమరో హీరో లేడు అనే పరిస్థితి వచ్చింది.

బేసిగ్గా పవన్, రజినీ, హిందీలో షారుక్ వీళ్లకు ఎన్ని ఫ్లాపులు పడ్డా, వసూళ్ల వరద ఆగదు. హిట్ పడితే అది బ్లాక్ బస్టర్ అవ్వక మానదు. కాకపోతే ఎవరి అడ్డాలో వాళ్ల క్రేజ్ అలా ఉంటుంది.. కాని ప్రభాస్ కి ప్రతీ అడ్డాలో అలాంటి క్రేజే దక్కింది. కాబట్టే టాక్ వీకైనా వసూల్లు కిక్ ఇచ్చే మార్కెట్ తనకి సొంతమైంది. ఆదిపురుష్ లాంటి హిట్ పడటంతో, తన స్టామినా ఏంటో మరోసారి ప్రూవ్ అయ్యింది.

ఆదిపురుష్ జోరుపెరిగింది. ఈ చిత్రం గ్లోబల్ బాక్స్ ఆఫీస్ వద్ద ₹140 కోట్లతో అద్భుతమైన ఓపెనింగ్ డే రెస్పాన్స్‌ని చూసింది. ఇంకా ఇలానే వసూళ్ల వర్షం కురిసేలా ఉంది. మొత్తానికి బాలీవుడ్ హీరోలకి, సౌత్ సూపర్ స్టార్లకు దక్కని ఒక క్రేజు, ఇమేజు ప్రభాస్ కి దక్కిందని ఆదిపురుష్ జోరు చూస్తుంటేనే అర్ధమౌతోంది. సో ఆదిపురుష్ జోరు వల్ల సలార్ కి ఎలా కలిసొస్తుందో కూడా ఊహించొచ్చు. ఎలా చూసినా ప్రభాస్ కి అన్నీ మంచి శకునములే కనిపిస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories