Prabhas: సలార్, ప్రాజెక్ట్ కే విషయంలో ప్రభాస్ సంచలన నిర్ణయం

Prabhas: ఆది పురుష సినిమా కోసం ప్రభాస్ ఏం నిర్ణయించుకున్నారంటే..

Jyothi
Updated on: 17 Feb 2023 9:00 PM IST
Prabhas Sensational Decision Regarding Salaar And  Project K Movies
X

Prabhas: సలార్, ప్రాజెక్ట్ కే విషయంలో ప్రభాస్ సంచలన నిర్ణయం

Prabhas: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మరియు "కేజిఎఫ్" ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ కాంబినేషన్లో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా "సలార్". గత కొంతకాలంగా ఈ సినిమాకి సంబంధించిన టీజర్ విడుదలవుతుంది అని అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఒకవైపు సినిమా ఈ ఏడాది సెప్టెంబర్ లో విడుదలకు సిద్ధమవుతోంది. కానీ ఇంకా సినిమాకి సంబంధించిన ఒక్క టీజర్ కూడా బయటకు రాలేదు. దీంతో అభిమానులు కూడా కొంత నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు ప్రభాస్ హీరోగా నటించిన "ఆది పురుష్" సినిమా టీజర్ కు ప్రేక్షకుల నుంచి విపరీతమైన నెగిటివ్ రెస్పాన్స్ వచ్చింది. సినిమాలోని విజువల్ ఎఫెక్ట్స్ ఏ మాత్రం బాగోలేదని అభిమానులు సైతం విమర్శల వర్షం కురిపించారు.అయితే తాజా సమాచారం ప్రకారం ఈ నేపథ్యంలోనే ప్రభాస్ తన ప్రాజెక్టుకే మరియు సలార్ సినిమా నిర్మాతలకి కొన్ని సూచనలు ఇచ్చారట. "ఆది పురుష్" సినిమా జూన్ 16 న విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే.

అందుకే ఈ సినిమా విడుదల అయ్యే లోపల మిగతా సినిమాలకు సంబంధించి ఏ అప్డేట్ బయటకు రాకూడదని ప్రభాస్ నిర్మతలను కోరారట. ప్రాజెక్ట్ కే లేదా సలార్ సినిమాలకి సంబంధించి ఏవైనా అప్డేట్స్ బయటకు వస్తే దానివల్ల వచ్చిన బజ్ వల్ల ఆది పురుష్ సినిమా మీద ఉండే అంచనాలు తగ్గిపోతాయని ప్రభాస్ ఇలా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. మరి టీజర్ తో ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయిన "ఆది పురుష్" సినిమా విడుదలయ్యాక ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో వేచి చూడాలి.

Jyothi

Jyothi

Next Story