"రాధేశ్యామ్" ను రెండు కోట్ల లో కూడా తీయొచ్చు అంటున్న ప్రభాస్

Prabhas Says Radheshyam Can be Taken Even in Two Crores
x

"రాధేశ్యామ్" ను రెండు కోట్ల లో కూడా తీయొచ్చు అంటున్న ప్రభాస్

Highlights

"రాధేశ్యామ్" కోసం 300 కోట్లు అవసరం లేదు అన్న ప్రభాస్

Prabhas: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "రాధేశ్యామ్" సినిమా 300 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కింది. ఈ మధ్యనే థియేటర్ లో విడుదలైన ఈ సినిమా చూసిన తర్వాత సినిమా కోసం అంత బడ్జెట్ అవసరం లేదని 150కోట్ల లో కూడా ఇలాంటి సినిమాని తీయవచ్చని కొందరు కామెంట్లు చేస్తున్నారు. అయితే మరోవైపు ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మాట్లాడుతూ ప్రభాస్ అన్న మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. "రాధేశ్యామ్" వంటి ప్రేమకథను అంత పెద్ద భారీ బడ్జెట్ తో సినిమా తీయాలని ఎందుకు అనిపించింది అని రాజమౌళి ప్రశ్నించగా ప్రభాస్ దానికి ఈ సినిమాను రెండు కోట్ల రూపాయల బడ్జెట్తో కూడా తీయొచ్చు అని అన్నారు.

కానీ కథ విన్న తర్వాత "రాధేశ్యామ్" వంటి సినిమాని భారీ బడ్జెట్ తో చేసి గ్రాండ్గా తెరకెక్కిస్తే ఇంకా బాగుంటుందని భావించినట్లుగా ప్రభాస్ తెలిపారు. నిర్మాతలు కూడా వెంటనే కుదరడంతో ట్రైన్ ఎపిసోడ్, షిప్ ఎపిసోడ్ లు చాలా ఖర్చు పెట్టి అద్భుతంగా తెరకెక్కించాలని అనుకున్నట్లుగా ప్రభాస్ అన్నారు. భారీ అంచనాల మధ్య విడుదలైనప్పటికీ ఈ సినిమా అనుకున్న స్థాయిలో మంచి రెస్పాన్స్ ని అందుకోలేకపోయింది. బాలీవుడ్లో కూడా "రాధేశ్యామ్" సినిమా భారీ నష్టాల పాలైంది. ఇక భారీ బడ్జెట్తో నిర్మించడంతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ పాయింట్ ను కూడా రీచ్ అవలేక డిస్ట్రిబ్యూటర్ లకు మర్చిపోలేని విధంగా దెబ్బకొట్టింది.

Show Full Article
Print Article
Next Story
More Stories