Salaar: షారుఖ్ 'డంకీ'తో ఢీ కొట్టనున్న ప్రభాస్ 'సలార్'.. క్రిస్మస్‌కే ఎందుకు రిలీజ్ చేస్తున్నారో తెలుసా?

Prabhas Salaar Release On Christmas 2023 And Clash With Shah Rukh Khan Dunki
x

Salaar: షారుఖ్ 'డంకీ'తో ఢీ కొట్టనున్న ప్రభాస్ 'సలార్'.. క్రిస్మస్‌కే ఎందుకు రిలీజ్ చేస్తున్నారో తెలుసా?

Highlights

Prabhas Salaar: ఒకవైపు సలార్ క్రిస్మస్ విడుదలకు సిద్ధమవుతుండగా, మరోవైపు బాక్సాఫీస్ వద్ద షారుక్ ఖాన్ నటించిన డంకీతో ఢీకొనడంతో సినిమా విడుదల తేదీపై ఆసక్తి నెలకొంది.

Prabhas Salaar: ఈ సంవత్సరం అతిపెద్ద చిత్రాలలో ఒకటిగా పేరుగాంచిన ప్రభాస్ నటించిన 'సలార్' ఈ ఏడాది క్రిస్మస్ సందర్భంగా విడుదల కానుంది. ఈ క్రమంలో సలార్ నుంచి యాక్షన్-ప్యాక్డ్ టీజర్ ఫ్యాన్స్‌ కోసం వదిలారు. ఈ టీజర్ అభిమానుల్లో ఉత్కంఠను నింపింది. ఈ సినిమా కచ్చితంగా వెండితెరపై విధ్వంసం సృష్టిస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

క్రిస్మస్‌కే ఎందుకు విడుదల చేస్తున్నారు?

ఒకవైపు సలార్ క్రిస్మస్ విడుదలకు సిద్ధమవుతుండగా, మరోవైపు బాక్సాఫీస్ వద్ద షారుక్ ఖాన్ నటించిన డంకీతో ఢీకొనడంతో సినిమా విడుదల తేదీపై ఆసక్తి నెలకొంది. దీంతో సలార్ నిర్మాతలు తమ చిత్రానికి క్రిస్మస్ విడుదలను ఎందుకు ఎంచుకున్నారనే దాని వెనుక ఆసక్తికరమైన కారణం వెల్లడైంది.

వార్తల ప్రకారం, "సలార్: పార్ట్ 1 - సీజ్‌ఫైర్ చిత్రాన్ని క్రిస్మస్ సందర్భంగా విడుదల చేయడానికి ఒక కారణం తెలుస్తోంది. 5 సంవత్సరాల క్రితం క్రిస్మస్ వారాంతంలో KGF 1 విడుదల చేశారు. ప్రేక్షకులు ఇష్టపడతారని వారు భావించారు. సినిమాని ఆస్వాదించడానికి ఇదే సరైన సమయం అని భావించారు. అనుకున్నట్లే సినిమా ఘన విజయం సాధించింది.

కేజీఎఫ్ 1, 2 నిర్మాతలు హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై నిర్మించారు. ఈ ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచింది. కాబట్టి సలార్: పార్ట్ 1 - సీజ్‌ఫైర్ ఖచ్చితంగా విజయాన్ని అందిస్తుందని నిర్మాతలు చెబుతున్నారు. ఇది కాకుండా, ఈ మెగా యాక్షన్-ప్యాక్డ్ సినిమాటిక్ ఫిల్మ్‌ని రూపొందించడానికి మొదటిసారిగా కలిసి పనిచేస్తోన్న కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్, బాహుబలి స్టార్ ప్రభాస్ కాంబినేషన్‌ కాసుల వర్షం కురిపిస్తుందని నమ్ముతున్నారు.

ఈ సినిమాలో ప్రభాస్‌తో పాటు పృథ్వీరాజ్ సుకుమారన్, శృతి హాసన్, జగపతి బాబు నటించనున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 22 డిసెంబర్ 2023న థియేటర్లలో విడుదల కానుంది. షారుఖ్ ఖాన్ సినిమా ‘డంకీ’తో ఢీ కొట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు. తాజాగా 'డంకీ' ఫస్ట్‌ టీజర్‌ను విడుదల చేశారు. కానీ, రిలీజ్ డేట్ ప్రకటించలేదు. మరి బాక్సాఫీస్ వద్ద ప్రభాస్, షారుక్ లు ఢీకొంటే ఎవరు గెలుస్తారో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories