Salaar: భారీ మొత్తానికి అమ్ముడైన "సలార్" ఓవర్సీస్ హక్కులు..

Shocking Update From Salaar Team
x

Salaar: "సలార్" గురించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన 

Highlights

Salaar: భారీ మొత్తానికి అమ్ముడైన "సలార్" ఓవర్సీస్ హక్కులు..

Salaar: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేతిలో ఉన్న బోలెడు ప్యాన్ ఇండియా సినిమాలలో ఒకటి "సలార్". కన్నడ సూపర్ హిట్ సినిమా "కేజీఎఫ్" ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ ఒక సినిమా సైన్ చేశారు. ఈ సినిమాకి "సలార్" అనే ఆసక్తికరమైన టైటిల్ ని కూడా ఖరారు చేశారు దర్శక నిర్మాతలు. ప్రశాంత్ నీల్ మరియు ప్రభాస్ కాంబినేషన్ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా గురించి బయటకు వస్తున్న ప్రతి అప్డేట్ సినిమాపై అంచనాలను భారీగా పెంచుతుందని చెప్పుకోవచ్చు.

యాక్షన్ థ్రిల్లర్ గా విడుదల కాబోతున్న ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రముఖ మలయాళం నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ గురించిన ఒక ఆసక్తికరమైన వార్త ఎప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాక ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాపై మంచి క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ చిత్ర ఓవర్సీస్ హక్కులు ఏకంగా 70 కోట్లకు అమ్ముడు అయినట్లు తెలుస్తోంది.

చూస్తూ ఉంటే ఈ సినిమా పై ప్రేక్షకులు చాలానే ఆశలు పెట్టుకున్నారు అని తెలుస్తోంది. హాంబలే ఫిలిమ్స్ పతాకం పై విజయ్ కిరగందూర్ ఈ సినిమాని 200 కోట్ల బడ్జెట్ తో భారీ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. రవి బశ్రుర్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమా భారీ అంచనాల మధ్య ఈ ఏడాది సెప్టెంబర్ 28న థియేటర్లలో విడుదల కాబోతోంది. జగపతిబాబు, మధు గురుస్వామి, ఈశ్వరి రావు, శ్రీయ రెడ్డి తదితరులు కూడా ఈ సినిమాలో ముఖ్య పాత్రలలో కనిపించబోతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories