"సలార్" గురించి ఆసక్తికరమైన అప్డేట్

Salaar: ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన "రాధే శ్యామ్" సినిమా త్వరలో విడుదల కానుంది.

admin1
Updated on: 29 Jan 2022 5:25 PM IST
Prabhass Salaar Movie Will be Released as Two Parts
X

"సలార్" గురించిన ఆసక్తికరమైన అప్డేట్ 

Salaar: ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన "రాధే శ్యామ్" సినిమా త్వరలో విడుదల కానుంది. ఇక ఈ సినిమా తరువాత ప్రభాస్ హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా "సలార్". కే జి ఎఫ్ సినిమా ఫేమ్ ప్రశాంత్ నీల్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే మొదలైంది. శ్రుతిహాసన్ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. హొంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరగందుర్ ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. రవి బస్రుర్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు.

తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. "సలార్" సినిమా రెండు భాగాలుగా విడుదల కాబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా కథని ఒక భాగంలో చెప్పే కంటే రెండు భాగాలుగా తీయటం బెటర్ అని దర్శక నిర్మాతలు అనుకుంటున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో రానుందట. "బాహుబలి" తర్వాత ప్రభాస్ కెరీర్ లో రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రెండవ సినిమా ఇది.

admin1

admin1

Next Story