ప్రభాస్ ఫ్యాన్స్ కి 'సలార్' పండగ!

Prabhas Salaar Movie started
x

ప్రభాస్ సలార్ సినిమా ప్రారంభం 

Highlights

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ కి పండగ కానుక ఇచ్చాడు. కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తాను నటించబోయే తాజా సినిమా సలార్ ను ఈరోజు...

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ కి పండగ కానుక ఇచ్చాడు. కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తాను నటించబోయే తాజా సినిమా సలార్ ను ఈరోజు లాంచనంగా ప్రారంభించేశాడు. కేజీఎఫ్ హీరో యష్ అతిథిగా ఈ కార్యక్రమానికి హాజరు అయ్యాడు.

ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ రాధేశ్యామ్ షూటింగ్ పార్ట్ పూర్తయింది. దీంతో తన తరువాతి సినిమాని పట్టలేక్కించేశాడు ప్రభాస్. ఇప్పటికే కేజీఎఫ్ 2 సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కావస్తుండటంతో దర్శకుడు ప్రశాంత్ నీల్ కూడా ఇప్పుడు ప్రభాస్ సినిమా 'సలార్' పై దృష్టి పెట్టాడు. ఇక సలార్ సినిమా కోసం ప్రభాస్ నాలుగు నెలలు సమయం ఇచ్చారని తెలుస్తోంది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాగా తెరకేకుతున్న 'సలార్' సినిమా ప్రకటించిన దగ్గరనుంచీ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సినిమాలో క్రూరుడుగా కనిపిస్తారట ప్రభాస్. అంతే కాకుండా మోహన్ లాల్ కూడా సినిమాలో ఓ ప్రధాన పాత్రలో కనిపించనున్నారని టాక్.

పూర్తి యాక్షన్ థ్రిల్లర్ గా 'సలార్' రూపుదిద్దుకోనుందని అంటున్నారు. కొంత సోషల్ కాన్సెప్ట్‌తో సామాన్యుల హక్కుల పోరాడే ఒక పవర్ ఫుల్ అండర్ వరల్డ్ డాన్ పాత్రలో ప్రభాస్ కనిపించనున్నాడట. ఈ సినిమాపై ప్రభాస్ అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకులకు సైతం విపరీతంగా అంచనాలు ఉన్నాయి.






Show Full Article
Print Article
Next Story
More Stories