Salaar: అన్న వస్తుండు.. వచ్చేసింది 'సలార్' అప్డేట్..

Prabhas Salaar film Release Date Announced
x

Salaar: అన్న వస్తుండు.. వచ్చేసింది ‘సలార్’ అప్డేట్..

Highlights

Prabhas - Salaar: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.

Prabhas - Salaar: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. ఎట్టకేలకు సలార్ అప్డేట్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమా ఇది. ఈ మధ్యనే "రాధే శ్యామ్" సినిమాతో ఊహించని డిజాస్టర్ ను అందుకున్న ప్రభాస్ ఈ సినిమా పైనే తన ఆశలన్నీ పెట్టుకున్నారు.

అభిమానులు కూడా ఈ సినిమా ఎప్పుడు ఎప్పుడు విడుదల అవుతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. శ్రుతిహాసన్ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. వచ్చే ఏడాది సెప్టెంబర్‌ 28న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ స్పెషల్‌ పోస్టర్‌ షేర్‌ చేసింది.

ఇందులో ప్రభాస్ కత్తి పట్టి నరికిన తీరు, ఆ శవాలు అలా పడి ఉండటం, రెండు చేతుల్లో రెండు కత్తులు పట్టి చేస్తోన్న యాక్షన్ సీక్వెన్స్‌కు సంబంధించిన పోస్టర్ చూసి జనాలు ఫిదా అవుతున్నారు. టీమ్ ఇచ్చిన అప్‌డేట్‌తో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం 'సలార్ ఆగమనం‌' అనే ట్యాగ్‌ సోషల్‌మీడియా ట్రెండింగ్‌లో దూసుకెళ్తోంది. 'అన్న వస్తుండు..' అంటూ అభిమానులు సందడి చేస్తున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories