Prabhas: "అందుకే కొత్తగా ట్రై చేస్తూ ఉంటాను" అంటున్న ప్రభాస్

Prabhas: "అందుకే కొత్తగా ట్రై చేస్తూ ఉంటాను" అంటున్న ప్రభాస్

admin1
Updated on: 3 March 2022 6:00 PM IST
Prabhas Said he Will Continue to Strive for Something New
X

"అందుకే కొత్తగా ట్రై చేస్తూ ఉంటాను" అంటున్న ప్రభాస్

Prabhas: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న "రాధే శ్యామ్" సినిమా భారీ అంచనాల మధ్య ఈనెల 11వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో వివిధ భాషల్లో విడుదలకు సిద్ధమవుతోంది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి రాధా కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర ప్రమోషన్స్ లో బిజీగా ఉంది చిత్ర యూనిట్. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రభాస్ కొన్ని ఆసక్తి కరమైన కామెంట్లు చేశారు. అమితాబచ్చన్ ఒక లెజెండ్ అని అందరూ ఆయనను ప్రేమిస్తారని చెప్పిన ప్రభాస్ అమితాబచ్చన్, సల్మాన్ ఖాన్ మరియు షారుక్ ఖాన్ లు బాలీవుడ్ లోని తన అభిమాన నటులని, వారే తనకు ఇన్స్పిరేషన్ అని చెప్పారు ప్రభాస్.

"ప్రతి రెండు సినిమాల తర్వాత నాకు కొత్తగా ట్రై చేయాలి అనిపిస్తూ ఉంటుంది. తెలుగులో కూడా కొన్ని యాక్షన్ సినిమాలు చేస్తూ ఉన్న సమయంలో మిస్టర్ పర్ఫెక్ట్, డార్లింగ్ వంటి లవ్ స్టోరీస్ చేశాను. అవి చాలా బాగా వర్కౌట్ కూడా అయ్యాయి. ఆ రెండు సినిమాలు చాలా పెద్ద హిట్ అయ్యాయి. ఆడియన్స్ కి బోర్ కొట్టించడం నాకు ఇష్టం లేదు. నేను కేవలం యాక్షన్ సినిమాలు మాత్రమే చేయగలను అని వాళ్లు అనుకోకూడదు. అలా అని రాధేశ్యామ్ సినిమాలో కూడా యావహన్ సన్నివేశాలు లేవని కాదు. ట్రైలర్ చూస్తే మీకే తెలుస్తుంది. కానీ ఆడియన్స్ కి బోర్ కొట్టకుండా ఉండాలని ఎప్పటికప్పుడు కొత్తగా ట్రై చేస్తూ ఉంటాను" అని చెప్పుకొచ్చారు ప్రభాస్.

admin1

admin1

Next Story