అతని ఆధారంగానే ప్రభాస్ పాత్ర ఉంటుంది అంటున్న రాధే శ్యామ్ డైరెక్టర్...

Radhe Shyam - Prabhas: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా "రాధే శ్యామ్"...

admin1
Updated on: 3 Jan 2022 12:31 PM IST
Prabhas Role in Radhe Shyam Movie is Designed According to Cheiro Astrologer | Tollywood News
X

అతని ఆధారంగానే ప్రభాస్ పాత్ర ఉంటుంది అంటున్న రాధే శ్యామ్ డైరెక్టర్...

Radhe Shyam - Prabhas: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా "రాధే శ్యామ్". ఎప్పుడో 2019 లో "సాహో" సినిమా తో ప్రేక్షకులను పలకరించిన ప్రభాస్ ఆ తర్వాత వెండితెరపై కనిపించింది లేదు. జిల్ ఫేం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.

యు.వి.క్రియేషన్స్ మరియు టి సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి జస్టిన్ ప్రభాకరన్ సంగీతాన్ని అందిస్తున్నారు.కృష్ణంరాజు, సచిన్ ఖేడేకర్, భాగ్యశ్రీ, తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర బృందం ప్రమోషన్స్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలోనే పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటున్న డైరెక్టర్ రాధాకృష్ణ సినిమాలో ప్రభాస్ పోషించిన విక్రమాదిత్య పాత్ర గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. విక్రమాదిత్య పాత్ర చీరో (విలియం జాన్ వార్నర్) మీద ఆధారపడి ఉంటుంది. చీరో ఒక ఆస్ట్రాలజర్. అతను ఇండియాలో పామిస్ట్రీ, ఆస్ట్రాలజీ, మరియు న్యూమరాలజీ కూడా నేర్చుకున్నారు. అతని ఆధారంగానే ఈ సినిమాలో విక్రమాదిత్య ను చిత్రీకరించాం" అని చెప్పుకొచ్చారు రాధాకృష్ణ.

admin1

admin1

Next Story