Prabhas: ప్రభాస్ ఏ డైరెక్టర్ తో పని చేయాలనుకుంటున్నారో తెలుసా?

Prabhas Reveals his Favorite Director
x

Prabhas: ప్రభాస్ ఏ డైరెక్టర్ తో పని చేయాలనుకుంటున్నారో తెలుసా?

Highlights

Prabhas: బాహుబలి సినిమాతో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు.

Prabhas: బాహుబలి సినిమాతో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. ఒక్క సినిమాతో ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిపోయిన ప్రభాస్ తో సినిమా చేయాలంటే మామూలు విషయం కాదు. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న స్టార్ హీరోలలో ప్రభాస్ కూడా ఒకరు. స్టార్ డైరెక్టర్ల నుంచి ప్రముఖ నిర్మాణ సంస్థల వరకు అందరూ ప్రభాస్ తో సినిమా చేయడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ తో ఒక్కసారైనా సినిమా చేయాలని ఇంటి ముందు క్యూ కడుతున్నారు.

కానీ ప్రభాస్ కి ఏ డైరెక్టర్ తో పని చేయాలని ఉందో తెలుసా? తాజాగా బాలకృష్ణ వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ అనే సెలబ్రిటీ టాక్ షో కి ప్రభాస్ గెస్ట్ గా విచ్చేసిన సంగతి తెలిసిందే. ఈ ఎపిసోడ్ కి సంబంధించిన మొదటి భాగం ఇప్పుడు ఆహా లో స్ట్రీమ్ అవుతోంది. తాజాగా ఈ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రభాస్ తన అభిమాన డైరెక్టర్ గురించి చెప్పుకొచ్చారు. తనకి మణిరత్నం అంటే చాలా ఇష్టమని ఆయన దర్శకత్వం వహించిన సినిమాలు తనకి చాలా బాగా నచ్చుతాయని అన్న ప్రభాస్ మణిరత్నం తో ఒక సినిమా చేయాలని ఉంది అని అన్నారు.

అంతేకాకుండా బాపూ దర్శకత్వం అన్న కూడా తనకి చాలా ఇష్టమని అన్నారు ప్రభాస్. కృష్ణంరాజు బాపూ దర్శకత్వంలో "భక్తకన్నప్ప" సినిమా చేశారని ప్రభాస్ గుర్తుచేసుకోగా బాలకృష్ణ కూడా తాను నటించిన "శ్రీరామరాజ్యం" సినిమాకి కూడా బాపూ దర్శకత్వం వహించారని కేవలం బాపు డైరెక్టర్ కాబట్టే తాను ఆ సినిమాకి ఒప్పుకున్నానని అన్నారు బాలయ్య. బాపు డైరెక్షన్లో ప్రభాస్ సినిమా ఎలాగో చూడలేకపోయాం. మరి మణిరత్నం ప్రభాస్ తో సినిమా ఎప్పటికీ చేస్తారో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories