Prabhas Remuneration : పారితోషికంలో చరిత్ర సృష్టించిన ప్రభాస్! ఎంతో తెలిస్తే మతిపోతుంది!!

Prabhas Remuneration | ఆదిపురుష్ సినిమాకి ప్రభాస్ రెమ్యునరేషన్ ఇప్పడు సంచలనంగా మారింది.

K V D Varma
Published on: 5 Sept 2020 10:43 PM IST
Prabhas Remuneration : పారితోషికంలో చరిత్ర సృష్టించిన ప్రభాస్! ఎంతో తెలిస్తే మతిపోతుంది!!
X

Adipurush prabhas look file image

Prabhas Remuneration | ఒక సినిమా వంద కోట్లు కలెక్షన్లు రాబట్టడం అంటే అబ్బో అనే రోజుల్ని మార్చిన నటుడు ప్రభాస్. ఒక సినిమాకి నూట ఏభై కోట్ల బడ్జెట్ అనే రేంజిని దాటించిన హీరో యంగ్ రెబల్ స్టార్. ఇప్పుడు తన సినిమా బడ్జెట్ రేంజి వెయ్యికోట్లు! అవును ప్రభాస్ తాజా చిత్రం 'ఆదిపురుష్' వెయ్యికోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఇది హాలీవుడ్ సినిమాల బడ్జెట్ లాంటిది. ఒక తెలుగు సినిమా హీరో నటించిన సినిమాకి అంత బడ్జెట్ అనేది కలలో కూడా ఊహించలేనిది.

బాహుబలి తరువాత మారిన ప్రభాస్ స్టేటస్ సాహో సినిమాతో మరింత పెరిగిపోయింది. రామ్ చరణ్, మహేష్ బాబు వంటి తెలుగు హీరోలు 50 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్నారు. ప్రభాస్ బాహుబలి తరువాత చేసిన సినిమాలు స్వంత బ్యానర్ లోనే. అందువల్ల ప్రభాస్ ఎంత తీసుకున్నారనే విషయం లెక్క తెలీదు. కానీ, ఇప్పుడు తెలుస్తున్న వార్త మాత్రం టాలీవుడ్ హీరోల రేంజి ఏ స్థితిలో ఉందొ తెలియచెబుతోంది.

అది..ప్రభాస్ కు ఆదిపురుష్ సినిమాకి ఇస్తున్న పారితోషికం ఎంతో తెలుసా? వంద కోట్లు అంటున్నారు. అవును అక్షరాల వంద కోట్లరూపాయలు. బాలీవుడ్ హీరోల్లో అక్షయ్, షారుఖ్, సల్మాన్, అమీర్ ఖాన్‌ల మించి తీసుకునే రేంజ్‌ రెమ్యునరేషన్ ఇది. నూరుకోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోగా ప్రభాస్ ఇప్పుడు కొత్త చరిత్ర సృష్టిస్తున్నారు.

గుల్షన్ కుమార్, టి-సిరీస్ ఫిల్మ్స్ సమర్పణలో భూషణ్ కుమార్ నిర్మిస్తున్న 'ఆది పురుష్' సినిమాకు గాను ప్రభాస్ రెమ్యునరేషన్ 100 కోట్లుగా బాలీవుడ్ లో చెప్పుకుంటున్నారు. రాముడిగా ప్రభాస్ నటిస్తున్న ఈ సినిమాలో సైఫ్ ఆలీఖాన్ రావణాసురిడిగా నటిస్తున్నారు. హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో ఈ సినిమాను రూపొందిస్తున్నారు.

K V D Varma

K V D Varma

Next Story