చెన్నై జ్ఞాపకాల్లో 'డార్లింగ్' ప్రభాస్: "నేను పుట్టింది అక్కడే.. ఆ స్కూల్ అంటే నాకెంతో ఇష్టం!"

చెన్నై జ్ఞాపకాల్లో డార్లింగ్ ప్రభాస్: నేను పుట్టింది అక్కడే.. ఆ స్కూల్ అంటే నాకెంతో ఇష్టం!
x
Highlights

Prabhas: వెండితెరపై ‘బాహుబలి’గా అలరించిన ప్రభాస్, వ్యక్తిగత జీవితంలో తన చెన్నై మూలాలను గుర్తుచేసుకున్నారు.

Prabhas: వెండితెరపై ‘బాహుబలి’గా అలరించిన ప్రభాస్, వ్యక్తిగత జీవితంలో తన చెన్నై మూలాలను గుర్తుచేసుకున్నారు. సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన ‘కపుల్ ఫ్రెండ్లీ’ చిత్ర బృందంతో ముచ్చటించిన సందర్భంగా ప్రభాస్ తన బాల్య విశేషాలను పంచుకున్నారు. ఈ సినిమా కథాంశం ప్రధానంగా చెన్నై నేపథ్యంలో సాగడంతో, ప్రభాస్ తన పాత జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయారు.

అక్కడే నా బాల్యం:

"నేను పుట్టి పెరిగింది చెన్నైలోనే. అక్కడి ప్రఖ్యాత డాన్ బాస్కో స్కూల్‌లో నా చదువు సాగింది. హైదరాబాద్‌కు షిఫ్ట్ అయిన తర్వాత నా బాల్యం గడిచిన ఆ నగరాన్ని నేను చాలా మిస్ అవుతుంటాను. ఇప్పటికీ చెన్నై వెళ్లినప్పుడు నా స్కూల్‌ను చూడటం నాకు అలవాటు" అని ప్రభాస్ చెప్పుకొచ్చారు.

మళ్ళీ మెరుగైన తమిళం:

హైదరాబాద్ వచ్చిన కొత్తలో తమిళం మాట్లాడటం దాదాపు మర్చిపోయానని, కానీ సినిమా ఇండస్ట్రీలోని టెక్నీషియన్లు, రాజు మాస్టర్, ప్రభు మాస్టర్ వంటి వారితో నిరంతరం మాట్లాడటం వల్ల మళ్ళీ తన తమిళం మెరుగైందని ప్రభాస్ తెలిపారు. మాతృభాష తెలుగు అయినప్పటికీ, పెరిగిన వాతావరణం వల్ల చెన్నై అంటే తనకు ప్రత్యేకమైన ఇష్టమని వెల్లడించారు.

'కపుల్ ఫ్రెండ్లీ' గురించి..

యూవీ కాన్సెప్ట్స్ పతాకంపై అజయ్ కుమార్ రాజు నిర్మించిన ఈ చిత్రం లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్న ఓ జంట కథతో తెరకెక్కింది. ఈ సినిమాను ప్రభాస్ ప్రశంసిస్తూ, చిత్ర యూనిట్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ప్రభాస్ వంటి స్టార్ హీరో తన పాత జ్ఞాపకాలను పంచుకోవడంతో, ఆయన అభిమానులు సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియోను వైరల్ చేస్తున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories