Radhe Shyam: మైండ్ బ్లోయింగ్ పోస్టర్ ను విడుదల చేసిన "రాధేశ్యామ్" బృందం

Prabhas Releases Radhe Shyam Poster on Krishna Janmashtami 2021
x

మైండ్ బ్లోయింగ్ పోస్టర్ ను విడుదల చేసిన "రాధేశ్యామ్" బృందం

Highlights

Radhe Shyam: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా "రాధేశ్యామ్".

Radhe Shyam: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా "రాధేశ్యామ్". రాధా కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. చాలా కాలం తర్వాత ప్రభాస్ నటిస్తున్న ప్రేమ కథ చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇంతకు మునుపెన్నడూ చూడనటువంటి ప్రేమ కథగా తెరకెక్కనున్న ఈ సినిమా టీజర్ ఇప్పటికే మంచి రెస్పాన్స్ ను అందుకుంది. తాజాగా ఇవాళ కృష్ణాష్టమి సందర్భంగా దర్శక నిర్మాతలు ఒక అద్భుతమైన పోస్టర్ను విడుదల చేశారు. ఈ జన్మాష్టమిని ఈ పోస్టర్ తో సెలబ్రేట్ చేసుకోండి అంటూ ప్రభాస్ స్వయంగా తన ఇన్స్టాగ్రామ్ ద్వారా పోస్టర్ను విడుదల చేశారు.

ఈ పోస్టర్ లో పూజా హెగ్డే పియానో వాయిస్తూ కనిపించగా ప్రభాస్ నవ్వుతూ కనిపించారు. ఈ పోస్టర్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది. ఈ సినిమా కథ గురించి ఇప్పటికే బోలెడు పుకార్లు బయటకు వచ్చాయి కానీ దర్శక నిర్మాతలు మాత్రం కథ గురించి ఎటువంటి క్లూ ఇవ్వడం లేదు. టీ సిరీస్ మరియు యువి క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 14న విడుదలకు సిద్దమవుతోంది. కృష్ణంరాజు ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. జస్టిన్ ప్రభాకరన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories