Zombie Reddy :‌ జాంబిరెడ్డికి సాయం చేయనున్న ప్రభాస్..?‌

Samba Siva Rao
Published on: 31 Dec 2020 2:46 PM IST
Zombie Reddy :‌ జాంబిరెడ్డికి సాయం చేయనున్న ప్రభాస్..?‌
X

తేజ సజ్జ హీరోగా దర్శకుడు ప్రశాంత్‌ వర్మ తెరకెక్కిస్తున్న చిత్రం జాంబిరెడ్డి. ఈ సినిమా టీజర్‌, పోస్టర్‌లను స్టార్‌ హీరోయిన్ సమంత, నిర్మాత దిల్‌ రాజు ఇటీవలే విడుదల చేయగా.. ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభించింది. తాజాగా ఈ సినిమా సంబంధించి ఆసక్తికర సమాచారం బయటకు వచ్చింది. వచ్చే ఏడాది జనవరి 2న యంగ్ రెబల్ స్టార్ బాహుబలి ప్రభాస్‌ చేతుల మీదుగా ఓ స్పెషల్‌ సర్‌ప్రైజ్‌ ఉండబోతుందని తెలుస్తోంది. ప్రభాస్‌ ఈ చిత్రం నుంచి ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు ఇండస్ట్రీ వర్గల్లో టాక్ నడుస్తోంది.

తేజ సజ్జ ఇంద్ర మూవీలో చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా నటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో ఆనంది, దక్ష నగార్కర్‌ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. రఘుబాబు, పృథ్వీరాజు, గెటప్‌ శ్రీను, కిరీటి, హరితేజ, అన్నపూర్ణమ్మ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కె. రాబిన్‌ సంగీతం అందించగా రాజశేఖర వర్మ నిర్మాతగా వ్యవహరించారు. జాంబి రెడ్డి టీమ్‌ పోస్టర్‌ సహా ప్రతీది సెలబ్రిటీల చేతుల మీదుగా విడుదల చేస్తూ పబ్లిసిటీ చేసుకుంటోంది. పాన్‌ ఇండియా స్టార్ల జాబితాలో చేరిన ప్రభాస్‌తో సర్‌ప్రైజ్‌ రివీల్‌ చేస్తుండటం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.


Samba Siva Rao

Samba Siva Rao

Next Story