ఆ స్టార్ డైరక్టర్ కు నో చెప్పిన ప్రభాస్.. ఇండస్ట్రీ షాక్?

Prabhas: *కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ని తిరస్కరించిన టాలీవుడ్ స్టార్

Sriveni Erugu
Updated on: 1 Jun 2022 8:01 AM IST
Prabhas says no to Kamal Haasan director
X

కమల్ హాసన్ డైరెక్టర్ కి నో చెప్పిన ప్రభాస్

Prabhas: ఈ మధ్యకాలంలో సినిమా సినిమా కీ ఫ్యాన్ ఫాలోయింగ్ ని పెంచుకుంటూ ఇప్పుడు ప్యాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. కానీ దశాబ్దకాలంలో ప్రభాస్ తన మొట్టమొదటి బాక్సాఫీస్ డిజాస్టర్ ను ఎదుర్కొన్నారు. దీంతో ఒక్కసారిగా జాగ్రత్త పడ్డ ప్రభాస్ తన తదుపరి సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే కొందరు డైరెక్టర్ల వద్ద కథలు విన్న ప్రభాస్ వాటిని నిరభ్యంతరంగా తిరస్కరిస్తున్నారట. అయితే తాజాగా ప్రభాస్ ఒక కాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కి నో చెప్పటం ఇప్పుడు అభిమానులను సైతం షాక్ కి గురి చేస్తోంది.

కార్తీ హీరోగా నటించిన "ఖైదీ" వంటి బ్లాక్ బస్టర్ సినిమా తో దర్శకుడిగా తమిళ ఇండస్ట్రీకి పరిచయమైన లోకేష్ కనగరాజ్ విజయ్ హీరోగా నటించిన "మాస్టర్" సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించారు. ప్రస్తుతం లోకేష్ కనకరాజు దర్శకత్వం వహిస్తున్న "విక్రమ్" సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కమల్ హాసన్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం లోకేష్ కనగరాజ్ ఈ మధ్యనే ప్రభాస్ ను సంప్రదించి ఒక స్క్రిప్ట్ వినిపించాడట. హైదరాబాద్ లో ఒక వారం పాటు ఉన్న లొకేషన్ ప్రభాస్ కి ఒకసారి సాలిడ్ నెరేషన్ ఇచ్చారట. కానీ బాహుబలి లాంటి సినిమాల కోసం ఎదురు చూస్తున్నా ప్రభాస్ ఈ సినిమా కి నో చెప్పేశారట.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story