
Radheshyam Movie Poster:(Twitter)
Radheshyam Movie: ఫ్యాన్స్ కు ప్రభాస్ ఉగాది కానుక గా 'రాధేశ్యామ్' లవ్లీ లుక్ విడుదల చేసింది చిత్ర యూనిట్
Radheshyam Movie: ఉగాది కానుకగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న రాధేశ్యామ్ ఓ పోస్టర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ సినిమాలో ప్రభాస్ ప్రస్తుతం పూజా హెగ్డే హీరోయిన్ నటిస్తోంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమా టీజర్ ను విడుదల చేస్తామంటూ, గత కొంతకాలంగా నిర్మాతలు చెబుతూనే ఉండగా, వివిధ కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. కనీసం ఉగాదికైనా విడుదల చేయాలంటూ ఫ్యాన్స్ ఇటీవలి కాలంలో డిమాండ్ చేస్తుండటంతో, ఈ ఉదయం ప్రభాస్ లవ్లీ లుక్ అంటూ ఓ పోస్టర్ ను విడుదల చేశారు.
'ఎన్నో పండగలు... కానీ ప్రేమ ఒకటే' అంటూ ఇది విడుదలైంది. ఇక ఈ పోస్టర్ లో ప్రభాస్ ఎంతో అందంగా కనిపిస్తున్నాడు. దీనికి క్యాప్షన్ గా కొత్త సంవత్సరం ఆరంభం రోజున ఏ భాషలో ఎలా పిలుస్తారో చెప్పారు. ఉగాది, గుడీ పడవా, బైసాకి, వైషు, పుత్తాండు, జుర్ షీతల్, చెట్టి చాంద్, బోహగ్ బిహు, నవ్ రేహ్, పోయిలా బోషక్ అంటూ... వివిధ భాషల్లో ఉగాదిని గుర్తు చేస్తూ, శుభాభినందనలు తెలిపారు.
కాగా, ఈ చిత్రాన్ని రెబల్ స్టార్ కృష్ణంరాజు సమర్పిస్తున్నారన్న సంగతి తెలిసిందే. ప్రభాస్, విక్రమాదిత్య పాత్రలో నటిస్తుండగా, కృష్ణంరాజు కూడా ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. వాస్తవానికి జూలై 30న చిత్రాన్ని విడుదల చేస్తామని తేదీని కూడా ప్రకటించినా, కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పలు చిత్రాల విడుదల వాయిదా పడుతున్నాయి. ఈ నేపధ్యంలో రాధేశ్యామ్ చిత్రంపై కరోనా ఎఫెక్ట్ ఏ మేరకు పడుతుందో వేచి చూడాల్సిందే.
Many Festivals. One Love! 💞
— UV Creations (@UV_Creations) April 13, 2021
Here's wishing everyone a very #HappyUgadi, Gudi Padwa, Baisakhi, Vishu, Puthandu, Jur Sithal, Cheti Chand, Bohag Bihu, Navreh & Poila Boshak! #30JulWithRS
Starring #Prabhas & @hegdepooja pic.twitter.com/EejlKDylNh

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




