Radhe Shyam Trailer: అభిమానుల చేతుల మీదుగా "రాధేశ్యామ్" ట్రైలర్ విడుదల

రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతున్న రాధేశ్యామ్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో అభిమానుల చేతుల మీదుగా "రాధేశ్యామ్" సినిమా ట్రైలర్ విడుదల

Sandeep Reddy
Published on: 23 Dec 2021 10:19 PM IST
Prabhas Radhe Shyam Movie Trailer Released in Pre Release Event at Ramoji Film City Today 23 12 2021
X

Radhe Shyam Trailer: అభిమానుల చేతుల మీదుగా ప్రభాస్ "రాధేశ్యామ్" ట్రైలర్ విడుదల 

Radhe Shyam Trailer: బాహుబలి, సాహో సినిమాల తరువాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన చిత్రం "రాధేశ్యామ్" సినిమా ట్రైలర్ తాజాగా విడుదలైంది. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించాడు. వచ్చే ఏడాది జనవరి 14న సంక్రాంతి కానుకగా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది. "రాధేశ్యామ్" చిత్రంలో రెబల్ స్టార్ కృష్ణంరాజు పరమహంస పాత్రలో ఇటీవలే కీలక పాత్రలో నటించారు.

తాజాగా "రాధేశ్యామ్" సినిమా విడుదలకు దగ్గరపడటంతో చిత్ర యూనిట్ ఈ సినిమా ప్రమోషన్స్‌ జోరు పెంచింది. తాజాగా ఇక ఈ సినిమాకు వివిధ భాషలకు చెందిన ట్రైలర్స్‌ను ప్రభాస్ అభిమానుల చేతుల మీదుగా విడుదల చేయించారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుండి ప్రభాస్ అభిమానులు రామోజీ ఫిల్మ్ సిటీలో "రాధేశ్యామ్" ప్రీరిలీజ్ ఈవెంట్‌ లో సందడి చేస్తున్నారు. ప్రభాస్ "విక్రమాదిత్య" పాత్రలో, పూజా హెగ్డే "ప్రేరణ" పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ నిర్మించింది.


Sandeep Reddy

Sandeep Reddy

Next Story