అభిమానులకు అడ్వాన్సుగా ప్రభాస్ పుట్టినరోజు కానుక.. రాధేశ్యామ్ పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర యూనిట్

Arun Chilukuri
Published on: 21 Oct 2020 12:29 PM IST
అభిమానులకు అడ్వాన్సుగా ప్రభాస్ పుట్టినరోజు కానుక.. రాధేశ్యామ్ పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర యూనిట్
X

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఆయన ఫాన్స్ కు అడ్వాన్స్ గిఫ్ట్ ఇచ్చారు చిత్ర యూనిట్. రాధే శ్యామ్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో ప్రభాస్ విక్రమాదిత్య పేరుతో కనిపిస్తాడు. రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో ప్రభాస్‌, పూజాహెగ్డే జంటగా కనిపించనున్నారు. ప్రభాస్‌ పుట్టినరోజును(అక్టోబర్‌ 23) పురస్కరించుకుని 'రాధేశ్యామ్‌' సినిమాలో ఆయన లుక్‌ను‌ తెలియజేసేలా సరికొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. చాలా రోజుల తర్వాత ప్రభాస్‌ చిత్రానికి సంబంధించిన సరికొత్త అప్‌డేట్‌ రావడంతో అభిమానులు ఉత్సాహంగా ఉన్నారు.




Arun Chilukuri

Arun Chilukuri

Next Story