Prabhas: రాజమౌళి ని సోషల్ మీడియాలో ప్రశంసించిన ప్రభాస్

Prabhas: రాజమౌళి కి అభినందనలు తెలిపిన ప్రభాస్

R Tripura Malini
Published on: 13 Dec 2022 4:51 PM IST
Prabhas Praises Rajamouli on Social Media
X

Prabhas: రాజమౌళి ని సోషల్ మీడియాలో ప్రశంసించిన ప్రభాస్

Prabhas: ఒక్కో బ్లాక్ బస్టర్ సినిమా తో తెలుగు చలన చిత్ర పరిశ్రమ పేరు ప్రతిష్టలను ఒక్కో మెట్టు ఎక్కిస్తూ యావత్ ప్రపంచం టాలీవుడ్ వైపు చూసేలా చేసిన ఘనత జక్కన్న రాజమౌళికి మాత్రమే సొంతం. తాజాగా రాజమౌళి "ఆర్ ఆర్ ఆర్" సినిమాకి గాను న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డును గెలుచుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రభాస్ రాజమౌళికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. "మన గ్రేటెస్ట్ ఎస్ ఎస్ రాజమౌళి గారు ప్రపంచాన్ని జయించబోతున్నారు.

ఉత్తమ దర్శకుడిగా ప్రతిష్టాత్మకమైన న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డును గెలుచుకున్నందుకు, మరియు ఉత్తమ దర్శకుడిగా (రన్నర్ అప్) ఎల్ ఏ ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డులను గెలుచుకున్నందుకు నా అభినందనలు," అని ప్రభాస్ ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలియజేశారు. అంతే కాకుండా, "ఉత్తమ సంగీత దర్శకుడిగా ఎల్ ఏ ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డ్స్ అందుకున్నందుకు లెజెండరీ కీరవాణి గారికి అభినందనలు," అని కీరవాణి కి కూడా తన అభినందనలు తెలిపారు ప్రభాస్.

దీనికి రాజమౌళి కూడా ఒక ఎమోషనల్ కామెంట్ పెట్టారు. "థాంక్యూ డార్లింగ్. నా మీద నాకే నమ్మకం లేని సమయంలో నా అంతర్జాతీయ గుర్తింపును నువ్వు నమ్మావు," అని ప్రభాస్ పోస్ట్ కింద కామెంట్ చేశారు రాజమౌళి. "ఛత్రపతి" సినిమా సమయం నుండే ప్రభాస్ మరియు రాజమౌళిల స్నేహం కుదిరింది. ఇక "బాహుబలి" ఫ్రాంచైజ్ తో వీరి బంధం మరింత బలపడింది. ఇద్దరూ ఇప్పుడు వేరే ప్యాన్ ఇండియన్ సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ వీరి స్నేహం మాత్రం ఇంకా కొనసగుతూ ఉండడంతో అభిమానులు కూడా సంతోషిస్తున్నారు. ఇక రాజమౌళి త్వరలో మహేష్ బాబుతో సినిమా చేయనుండగా, ప్రభాస్ "ఆది పురుష్", "సలార్", "స్పిరిట్", "ప్రాజెక్ట్ కే", "రాజా డీలక్స్" సినిమాలతో బిజీగా ఉన్నారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story